సాక్షి, హైదరాబాద్: తెలుగునాట సంచలనం రేపిన టీవీ నటి సువ్వాడ నాగ ఝాన్సీ (21) సూసైడ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆమె ఆత్మహత్యకు ప్రియుడు సూర్యతేజనే కారణం అని పోలీసులు తేల్చారు. దీంతో అతనిపై ఐపీసీ సెక్షన్ 306, 417 ప్రకారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సూర్య వేధింపుల కారణంగానే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని పోలీసుల విచారణలో తేలింది. ఆమె చనిపోవడానికి కొన్నిగంటల ముందు సూర్యకు ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఝాన్సీని సూర్య తీవ్రస్థాయిలో మందలించడంతో మనస్తాపం చెందిన ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్థారించారు.
గతకొంత కాలంగా ఝాన్సీని ఆమె ప్రియుడు సూర్య మానసికంగా వేధిస్తున్నాడని, ఆమెకు ఇష్టం లేకున్నా బలవంతంగా నటనను మాన్పించాడని పోలీసులు పేర్కొన్నారు. తనను పెళ్లి చేసుకోవాంటే నటన మానేయాలని ఆంక్షలు విధించాడని, ఆ తరువాత అతను మోసం చేయడంతో ఝాన్సీ ఆత్మహత్య చేసుందని పోలీసులు తెలిపారు. తన కూతురు ఆత్మహత్యకు సూర్యతేజనే పూర్తి కారణమని, నమ్మించి మోసం చేసిన అతడిని కఠినంగా శిక్షించాలని ఝాన్సీ తల్లి సంపూర్ణ, సోదరుడు దుర్గాప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల కిత్రం సూర్యని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారివద్దనున్న ఆధారలతో ఆయనను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment