ప్ప్రశ్నించడం ఆపొద్దు
1950, 1960 సంవత్సరాల మధ్య ఎంతోమంది స్త్రీవాదుల ఉద్యమ ఫలితమే ఈ రోజున స్త్రీలందరూ బయటకొచ్చి మాట్లాడుతున్నారు. ఉదాహరణకు మా అమ్మమ్మ 4వ తరగతి వరకు చదివింది.
మా అమ్మ డిగ్రీ వరకు, నేను పీ.జీ వరకు చదువుకున్నాం. ఆ రోజున స్త్రీల హక్కుల కోసం వాళ్లు చేసిన ఉద్యమాల ఫలితమే ఈ మార్పు. ఎంతోమంది రచయితలు, కళాకారులు కదం తొక్కి ఉద్యమం చేస్తే ఈ రోజున స్త్రీవాదం బలపడింది. ఆ ఉద్యమకారులందర్నీ నేను మనస్ఫూర్తిగా స్మరించుకుంటున్నాను. స్త్రీలందరూ ఉద్యమాలను అవహేళన చేయొద్దు. ప్రశ్నించటం ఆపకండి.