
సాక్షి, హైదరాబాద్: సీరియల్ నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఆదివారం ఆమె ప్రియుడు సూర్యతేజను అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో పలు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఝాన్సీ ప్రియుడు సూర్య ఇదివరకే మధు అనే సీరియల్ నటితో ప్రేమ వ్యవహారం నడిపాడని, ఆ తర్వాత మధుకు బ్రేకప్ చెప్పిన సూర్య, ఝాన్సీని ప్రేమించినట్లు తెలుస్తోంది. మధు సహాయంతోనే అతడు ఝాన్సీని ట్రాప్ చేశాడని సమాచారం.
సూర్య మాజీ ప్రియురాలు మధునే ఝన్సీని అతనికి పరిచయం చేసినట్లు తెలుస్తోంది. ఝాన్సీ.. సూర్య పుట్టిన రోజు కానుకగా రెండు లక్షలు విలువ చేసే బైక్‌ను, ఆ తర్వాత 10 లక్షల రూపాయలు విలువచేసే బంగారు నగలను సైతం అతడికి ఇచ్చినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment