ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బుల్లితెర నటి నాగ ఝాన్సీ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఝాన్సీ కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ సంభాషణలపై పోలీసులు దృష్టి సారించారు. ఆమె ప్రియుడు సూర్య తేజ ప్రమేయంపై దర్యాప్తు చేపట్టారు. ఝాన్సీ సెల్ ఫోన్ లాక్‌ను ఓపెన్ చేసిన పోలీసులు ప్రియుడితో ఆమె చేసిన చాటింగ్ డేటాను రికవరీ చేశారు. మృతురాలి సెల్‌ఫోన్‌లో ఉన్న మెసేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. పలువురితో ఝాన్సీ చేసిన వాట్సప్ చాటింగ్, మెసేజ్‌లతో పాటు కొన్ని వీడియోలను గుర్తించినట్లు పంజాగుట్ట ఏసీపీ తెలిపారు. వాటి ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.