![Ravi Teja Launches Prementha Panichese Narayana Firstlook - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/11/prementha-pani-chese%5D.jpg.webp?itok=jY0FkbDO)
హరి, రవితేజ, శ్రీనివాస్
హరికృష్ణ జొన్నలగడ్డ హీరోగా జెఎస్‌ఆర్ మూవీస్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి సమర్పణలో జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘ప్రేమెంత పని చేసె నారాయణ’. అక్షిత, ఝాన్సీ, చిలుకూరి గంగారావు ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన హీరో రవితేజ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా పాటలు, ట్రైలర్‌తో పాటు కొన్ని సీన్స్ చూశాను. హీరో హరి డ్యాన్స్‌లు, డైలాగ్ డెలివరీ బాగున్నాయి. భవిష్యత్‌లో అతను మంచి స్థాయిలో ఉంటాడు. దర్శకుడు శ్రీనివాస్‌తో నాకు మంచి అనుబంధం ఉంది.
ఈ సినిమా ఆయనకు మంచి విజయంతో పాటు డబ్బుల్ని కూడా తీసుకు వస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసి, మా హరిని రవితేజ మెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. సినిమా షూటింగ్ పూర్తయింది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలను రిలీజ్ చేయనున్నాం. ఈ నెల చివరి వారంలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘రవితేజగారు నేను హీరోగా చేసిన సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయడం నా జీవితంలో మరచిపోలేని అనుభూతి. ఈ సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నా. నా ప్రయత్నాన్ని వారు దీవిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు హరి. ఈ సినిమాకు సంగీతం: యాజమాన్య.
Comments
Please login to add a commentAdd a comment