
హైదరాబాద్: టీవీనటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో కీలకంగా మారిన మొబైల్(ఐఫోన్) లాక్ ఇంకా తెరుచుకోలేదు. లాక్ తెరుచుకుంటే కేసు పురోగతి సాధిం చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యకు కారణంగా భావిస్తున్న ఆమె ప్రియుడు సూర్యతేజ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం అతన్ని పట్టుకునే అవకాశముందని తెలుస్తోంది. ఝాన్సీ వినియోగించిన రెండో మొబైల్ శామ్‌సంగ్ ఫోన్ లాక్ తెరుచుకున్నా అందులో కీలక ఆధారాలేవీ లభించలేదు.
కొన్ని వాట్సాప్ మెసేజ్‌లు డిలీట్ చేసి ఉన్నాయి. వాటిని తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు సీసీఎస్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఝాన్సీ కుటుంబ సభ్యు లు శనివారం కృష్ణా జిల్లా నుండి బయలుదేరి హైదరాబాద్‌కు రానున్నట్లు సమాచారం. వారి నుంచి వివ రాలు సేకరించి సూర్యతేజను అదుపులోకి తీసు కోనున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment