
పుట్టెడు దుఖంతో పది పరీక్షకు హాజరు
బుక్కరాయసముద్రం : తండ్రి గుండెపోటుతో చనిపోయినా ఆ దుఃఖాన్ని దిగమింగుకొని ఓ విద్యార్థిని పదో తరగతి పరీక్షలకు హాజరైంది. వివరాల్లోకెళితే... నార్పల మండలం జంగంరెడ్డిపేటకు చెందిన ప్రభాకర్‌రెడ్డి (40) బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. అతని కుమార్తె జాన్సీ పదో తరగతి అన్నే ఫెర్రర్ పాఠశాలలో టెన్త్ పరీక్షలు రాస్తోంది. తండ్రి మరణించినా గురువారం ఉదయం జాన్సీ పరక్షకు హాజరైంది.