
జైపూర్: ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగి ఆలనాపాలనా చూడాల్సిన నర్సింగ్ అసిస్టెంట్ అఘాయిత్యానికి పాల్పడిన అమానవీయ ఘటన రాజస్తాన్‌లో చోటుచేసుకుంది. అఘాయిత్యం వేళ ప్రతిఘటించిన ఆమెకు నిందితుడు మత్తుమందు ఇంజెక్షన్ ఇవ్వడం దారుణం. అల్వార్ జిల్లాలోని శివాజీ పార్క్ స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 24 ఏళ్ల వివాహిత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో తీవ్ర అస్వస్థతకు గురై జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.
పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఐసీయూ గదిలో చికిత్స అందిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో అక్కడే పనిచేసే చిరాగ్ యాదవ్ అనే నర్సింగ్ అసిస్టెంట్ ఆమెను రేప్‌చేయబోయాడు. వెంటనే ప్రతిఘటించిన ఆమెకు ఒక మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లేలా చేసి ఘోరానికి పాల్పడ్డాడు. తర్వాత కొంతసమయానికి భర్త ఫోన్ చేయగా ఆమె జరిగిన దారుణాన్ని చెప్పి బోరుమంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment