
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఇంట్లో ఒకరికి కరోనా వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. బోనీ ఇంటి సహాయకుడు 23 ఏళ్ల చరణ్ సాహుకి ఆరోగ్యం బాగాలేకపోవడంతో వైద్య పరీక్షలు చేయించగా కరోనా అని నిర్ధారణ అయిందట. దాంతో అతణ్ణి క్వారంటైన్‌కి తరలించారు. ఈ సందర్భంగా బోనీ కపూర్ మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం మా ఇంట్లో మాకెవరికీ (కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్) కరోనా లక్షణాలు కనిపించలేవు. లాక్ డౌన్ ప్రారంభించినప్పటి నుంచి మేం ఎవరం ఇంటి నుంచి బయటకు వెళ్లలేదు. అలాగే మా ఇంట్లో పని చేస్తున్న ఇతర సిబ్బందికి కూడా కరోనా లక్షణాలు లేవు. చరణ్ కోలుకుని మళ్లీ మా ఇంటి పనులకు హాజరవ్వాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు,