అసిస్టెంట్‌ ఇలా చేస్తాడని తెలీదు: రకుల్‌ | Actress Rakul Preet Posts Video Of Her Assistant | Sakshi
Sakshi News home page

అసిస్టెంట్‌ ఇలా చేస్తాడని తెలీదు: రకుల్‌

Published Thu, Jun 7 2018 10:23 AM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

Actress Rakul Preet Posts Video Of Her Assistant - Sakshi

అసిస్టెంట్‌ కుమార్‌తో నటి రకుల్‌ప్రీత్‌(పాత ఫొటో)

హైదరాబాద్‌: ఇండస్ట్రీ వర్గాలకు తప్ప స్టార్‌ హీరోయిన్‌, హీరోల వ్యవహారాలను చక్కబెట్టే వ్యక్తుల వివరాలు బయటివాళ్లకు పెద్దగా తెలియదు. ‘ఫలానా సమయంలో నా అసిస్టెంట్‌ ఇచ్చిన సలహా బాగా పనికొచ్చింద’ని సెలబ్రిటీలు చెప్పుకోవడం కూడా అరుదుగా వింటాం. వీటన్నింటికీ విరుద్ధంగా టాలీవుడ్‌ టాప్ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ చేసిన పని ప్రస్తుతం వైరల్‌ అయింది.

‘‘నా అసిస్టెంట్‌ కుమార్‌ ఇంత బాగా డాన్స్‌ చేయగలడని అస్సలు తెలీదు సుమీ! బహుశా లాంగ్‌ షూటింగ్‌ అవర్స్‌లో అతని స్టెప్స్‌ని రహస్యంగా షూట్‌చేసి ఉంటారు’’ అంటూ రకుల్‌ ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. అదికాస్తా నిమిషాల వ్యవధిలోనే వైరల్‌ అయింది. వేరొక మహిళతో సంభాషిస్తూ కుమార్‌ డాన్స్‌ చేయడాన్ని వీడియోలో చూడొచ్చు. కార్తీ హీరోగా రంజిత్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో రకుల్‌ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement