'చివరకు మిగిలేది’ నవలను సినిమాగా చేయాలని ఉంది | vema reddy direct's to naval as movie | Sakshi
Sakshi News home page

'చివరకు మిగిలేది’ నవలను సినిమాగా చేయాలని ఉంది

Published Sat, Jul 19 2014 1:31 AM | Last Updated on Tue, Sep 18 2018 8:13 PM

'చివరకు మిగిలేది’ నవలను సినిమాగా చేయాలని ఉంది - Sakshi

'చివరకు మిగిలేది’ నవలను సినిమాగా చేయాలని ఉంది

‘‘ఓ కారు డ్రైవర్ స్నేహం నా కెరీర్‌ని మలుపు తిప్పింది. సినిమా ఇండస్ట్రీలోకి రావాలన్న నా కలకు మార్గం ఆ డ్రైవర్ చూపించాడు. రహీమ్ అనే ఆ డ్రైవర్ నన్ను రచయిత పోసాని కృష్ణమురళి దగ్గర అసిస్టెంట్‌గా చేర్చాడు’’ అని రచయిత వేమారెడ్డి చెప్పారు. పోసాని దగ్గర రైటింగ్ అసిస్టెంట్‌గా, తర్వాత సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన వేమారెడ్డి ‘తడాఖా’, ‘రేసుగుర్రం’ తదితర చిత్రాలకు సంభాషణలు రాశారు. ప్రస్తుతం సుమంత్ అశ్విన్ హీరోగా ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తన కెరీర్ గురించి వేమారెడ్డి వివరిస్తూ -‘‘నాకు మొదట్నుంచీ దర్శకత్వం మీద మక్కువ ఉంది.

రచయితగా సంపాదించిన అనుభవంతో డైరక్షన్ చేస్తున్నాను. ఎమ్మెస్ రాజుగారు, సుమంత్ అశ్విన్ కథ వినగానే అంగీకరించారు. నా స్నేహితులే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సహజీవనం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అంతర్లీనంగా మంచి సందేశం కూడా ఉంది. ఇప్పటికి 50 శాతం సినిమా పూర్తయ్యింది’’ అని చెప్పారు. చిన్నప్పట్నుంచీ పుస్తకాలు చదవడం బాగా అలవాటని, ఎక్కడైనా బుక్ ఫెస్టివల్ జరిగితే అక్కడికి వెళ్లిపోతుంటానని అన్నారు. తాను చదివిన నవలల్లో ‘చివరికి మిగిలేది’ బాగా ఆకట్టుకుందని, దాన్ని కొంచెం సినిమాటిక్‌గా మార్చి, సినిమా చేయాలని ఉందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement