గోల్డ్‌కోస్ట్ : కామెన్ వెల్త్ క్రీడల్లో భారత వెయిలిఫ్టర్ల హవా కొనసాగుతోంది. తాజాగా 69 కేజీల విభాగంలో పూనమ్ యాదవ్ బంగారు పతకం కైవసం చేసుకున్నారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం వేకువ ఝామున జరిగిన పోటీల్లో ఆమె 222 కేజీల బరువును ఎత్తి పసిడి పతకం సాధించారు. దీంతో భారత పతకాల సంఖ్య ఏడుకు చేరగా.. అందులో ఐదు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం ఉన్నాయి. కాగా, పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇక పూనమ్ యాదవ్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, 2014 గ్లాస్గోవ్ కామెన్‌వెల్త్ క్రీడల్లో ఆమె కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే.
GOLD to Punam Yadav in 69 Kg weightlifting...big congratulations to her..super performance by our weightlifters continues at #GC2018 #PresidentKovind
— President of India (@rashtrapatibhvn) 8 April 2018
Comments
Please login to add a commentAdd a comment