'తాగి కన్నుమిన్ను కానక సెక్యూరిటీని తన్నింది' | Caught on CCTV: Security guard of a Jamshedpur hotel assaulted by a drunk girl | Sakshi
Sakshi News home page

'తాగి కన్నుమిన్ను కానక సెక్యూరిటీని తన్నింది'

Published Fri, Nov 20 2015 8:52 PM | Last Updated on Sat, Sep 15 2018 8:43 PM

'తాగి కన్నుమిన్ను కానక సెక్యూరిటీని తన్నింది' - Sakshi

'తాగి కన్నుమిన్ను కానక సెక్యూరిటీని తన్నింది'

జంషెడ్ పూర్: తాగితే కన్నూమిన్ను కానరాదని అంటారు. ఏం చేస్తున్నామో.. ఎలా ప్రవర్తిస్తున్నామనే కనీస సోయి ఉండదని చెప్తుంటారు. ఈ వీడియో చూస్తే అది నిజమే అనిపిస్తుంది కూడా. జంషెడ్ పూర్లో ఫుల్లుగా తాగిన అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఓ హోటల్ వద్ద ఉండే సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు.

వారు ఎంత వారిస్తున్నా వినకుండా పిడిగుద్దులతో, కాలితన్నులతో చుట్టుపక్కలవారిని అవాక్కయ్యేలా చేసింది. ఆమెకు తన బాయ్ ఫ్రెండ్ కూడా తోడై అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నవారిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో కళ్లొప్పగించి చూడటం అక్కడి చుట్టుపక్కల ఉన్నవారి, రహదారిపై వాహనాల్లో వెళ్లేవారి వంతయింది. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ వీడియో ప్రస్తుతం నెట్ లో హల్ చల్ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement