మహిళపై ఇద్దరు ఆగంతుకుల దాడి | Attack On Woman In Visakhapatnam | Sakshi
Sakshi News home page

మహిళపై ఇద్దరు ఆగంతుకుల దాడి

Published Sun, May 27 2018 10:45 AM | Last Updated on Sat, Aug 25 2018 4:51 PM

Attack On Woman In Visakhapatnam - Sakshi

ఆగంతుకులకు  సహకరించిన లోవలక్ష్మి,  దాడికి గురైన అరుణ

అక్కిరెడ్డిపాలెం(గాజువాక) : రెండు రోజుల కిందట ఓ వ్యక్తిపై ఆగంతుకులు మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన మరువక ముందే మరో మహిళపై ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాత్రూమ్‌కు వెళ్లి వస్తున్న మహిళ నోట్లో గుడ్డలు కుక్కి ఓ డాబాపై తీసుకువెళ్లి అక్కడి నుంచి తోసేసిన ఘటన జీవీఎంసీ 65వ వార్డు చిన అక్కిరెడ్డిపాలెంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. చినఅక్కిరెడ్డిపాలెంలో బి.అరుణ, పైడిరాజు దంపతులు తమ ఇద్దరు కుమారులతో రేకుల ఇంటిని అద్దెకు తీసుకుని నాలుగేళ్లుగా నివాసం ఉంటున్నారు. కూలీనాలీ చేసుకుని జీవనం సాగిస్తున్నారు.

శుక్రవారం అర్ధరాత్రి భర్త, పిల్లలు నిద్రలో ఉండగా.. అరుణ ఇంటి బయట ఉన్న బాత్రూమ్‌కు వెళ్లింది. తిరిగి వస్తుండగా అదే వరుసలో ఉంటున్న బంగా లోవలక్ష్మి ఇంట్లో నుంచి ఇద్దరు వ్యక్తులు ముసుగు వేసుకుని వచ్చి అరుణ నోట్లో గుడ్డలు కుక్కి బలవంతంగా కొంత దూరంలో ఉన్న ఓ డాబాపైకి తీసుకు వెళ్లి అక్కడి నుంచి తోసేశారు. దీంతో అరుణ నడుంకు దెబ్బతగలడమే కాకుండా షాక్‌ గురైంది. కింద పడిన అరుణ ఏడుపు విన్న గస్తీ పోలీసులు ఆమెను వెంటనే ఒక వాహనంలో కేజీహెచ్‌కు తీసుకువెళ్లి చికిత్స చేయించి ఇంటికి తీసుకువచ్చారు. ఈ లోపు భార్య కనిపించకపోవడంతో స్థానికుల సాయంతో పైడిరాజు చుట్టుపక్కల వెతకడం మొదలు పెట్టాడు.

అరుణను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు పోలీసులు తీసుకువెళ్లినట్టు తెలుసుకున్నాడు. విషయం తెలుసుకున్న గాజువాక సీఐ రామారావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించి, అనుమానిత మహిళ లోవలక్ష్మిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గాజువాక పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి యజమానిని అద్దెకు ఉంటున్న వారి వివరాలను గాజువాక సీఐ, ఎస్‌ఐ శ్రీనివాసరావు అడిగి తెలుసుకున్నారు. పలువురి అనుమానితులను స్టేషన్‌కు పిలిపించి సమాచారం సేకరిస్తున్నారు. విభిన్న కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement