శివమొగ్గ: పెళ్లికి అంగీకరించని ప్రియుడిపై ప్రియురాలు పట్టపగలు కత్తితో పొడిచి గాయపరిచిన ఉదంతం కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లి పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. పట్టణంలోని సొప్పుగుడ్డె ప్రాంతానికి చెందిన మేఘనాశెట్టి(22) స్థానికంగా ఉన్న కళాశాలలో బీబీఎం చదువుతోంది. ఇదే పట్టణానికి చెందిన కారు డ్రై వర్ సుమంత్ కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు.
మనస్పర్ధలు రావడంతో కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్నారు. ఇటీవల మేఘనా సుమంత్‌ను కలిసి పెళ్లి ప్రస్తావన తెచ్చింది. అందుకు సుమంత్ నిరాకరించాడు. ఈక్రమంలో గురువారం ఇద్దరూ బస్టాండు సమీపంలో కలిశారు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. క్షణికావేశంలో ఆగ్రహానికి లోనైన మేఘన వెంట తెచ్చుకున్న కత్తితో సుమంత్‌పై దాడిచేసి ముఖంపైన గాయపరచి ఉడాయించింది.
స్థానికులు స్పందించి బాధితుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మేఘనపై హత్యా యత్నం కేసు నమోదు చేసి నిందితురాలి కోసం గాలింపు చేపట్టారు.
పెళ్లికి అంగీకరించని ప్రియుడిపై కత్తితో దాడి!
Published Thu, Apr 28 2016 10:54 PM | Last Updated on Fri, Jul 12 2019 3:07 PM
Advertisement
Advertisement