థానె: పోలీసులపై దాడి చేసిన ఆరుగురు మహిళలపై కేసు నమోదు చేశారు. ఓ చీటింగ్ కేసులో నిందితుడిని అరెస్టు చేసేందుకు భీవండిలోని పిరనిపాద వెళ్లిన భీవండి క్రైం యూనిట్, ఓషివర పోలీసులపై అక్కడి మహిళలు ఆరుగురు దాడిచేశారని థానే పోలీసు ప్రతినిధి సుఖదా నర్కర్ తెలిపారు. ఓషివర పోలీసు స్టేషన్‌లో చీటింగ్, వంచన కేసులు నమోదైన వ్యక్తి కమర్ అలి జాఫ్రి పిరనిపాదలో ఉంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు, భీవండి క్రైం యూనిట్ సంయుక్తంగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి అతని ఇంటిని గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకుంటుండగా ఆరుగురు మహిళలు పోలీసులపై దాడిచేసి కొట్టడమేగాక కొందరి యూనిఫాంలను చింపేశారని, రాళ్లు రువ్వారని తెలిపారు. శాంతినగర్ పోలీసు స్టేషన్‌లో ఈ మహిళలపై ఐపీసీ 353(ప్రభుత్వ ఉద్యోగిపై దాడిచేయడం, విధులకు ఆటంకం కలిగించడం), 332 కింద కేసులు నమోదు చేసినట్లు సుఖదా నర్కర్ తెలిపారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment