cases booked
-
ఆ కేసులు ఉపసంహరించుకోండి లేదంటే...
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ శనివారం ఆందోళన చేసిన రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం– రైతు సంఘాల ఐక్యవేదిక) డిమాండ్ చేసింది. ఆందోళనలు చేపట్టి ఏడు నెలలైన సందర్భంగా పలు రాష్ట్రాల్లో గవర్నర్లకు విజ్ఞాపనపత్రాలు ఇవ్వడానికి రైతులు రాజ్‌భవన్‌లవైపు వెళ్లగా... పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ‘చండీగఢ్‌లో పలువురు ఎస్కేఎం నాయకులు, ఆందోళనకారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ 147, 148, 149, 186, 188, 332, 353 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. రాజ్‌భవన్‌కు దారులు మూసివేయడమే కాకుండా రైతులపై వాటర్ క్యానన్లు ప్రయోగించారు. లాఠీచార్జి చేశారు. పైగా అప్రజాస్వామికంగా కేసులు బనాయించారు. ఎస్కేఎం దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. వెంటనే భేషరతుగా ఈ కేసులన్నింటినీ ఉపసంహరించాలి’ అని ఎస్కేఎం ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ఇంత నిర్లక్ష్యమా?: రాహుల్ రైతుల ఆందోళనలు ఉధృతమవుతున్నా... ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. 200 రోజులకు పైగా ఢిల్లీ శివార్లలో ఆందోళనలను నిర్వహిస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించారు. ‘తమ జీవనోపాధికి రక్షణ కల్పించాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ దిగుబడులను అమ్మితే వచ్చే డబ్బు కంటే పెట్టుబడులు అధికంగా ఉంటున్నాయి. రైతుల ఆందోళనలు ఉధృతమవుతున్నా... ప్రభుత్వ విధానాల్లో వీరిపట్ల ఎలాంటి సానుభూతి కనిపించడం లేదు’ అని రాహుల్ మండిపడ్డారు. చదవండి: డీఏను తక్షణమే పునరుద్ధరించాలి: కాంగ్రెస్ తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు ఆపాల్సిందే -
బ్యాంక్ అక్రమాల్లో రూ లక్ష కోట్లు ఆవిరి : ఆర్బీఐ
సాక్షి, ముంబయి : బ్యాంకుల్లో అవకతవకలు, మోసాల కారణంగా కోట్లాది ప్రజాధనం పక్కదారిపడుతోంది. గత ఐదేళ్లలో బ్యాంకుల్లో చోటుచేసుకున్న 23,000కు పైగా అవకతవకల కేసుల్లో రూ లక్ష కోట్ల మేర ధనం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లిందని ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. బ్యాంకుల్లో ఏప్రిల్ 2017 నుంచి మార్చి 2018 వరకూ అవకతవకల కేసులు 5152 కేసులకు పెరిగాయని ఆర్టీఐ కింద కోరిన సమాచారానికి బదులిస్తూ ఆర్బీఐ వెల్లడించింది. ఈ కేసుల్లో రూ 28,459 కోట్లు చిక్కుకున్నాయని పేర్కొంది. ఇక 2016-17లో రూ 23,933 కోట్ల విలువైన 5976 అక్రమాల కేసులు బ్యాంకింగ్ రంగంలో నమోదయ్యాయని తెలిపింది. గత ఐదేళ్లలో మొత్తం లక్షా718 కోట్ల మేర ధనం 23,866 అక్రమార్కుల అవకతవకల ఫలితంగా ఆవిరైందని ఆర్బీఐ వెల్లడించింది. ఈ కేసులను సమగ్రంగా పరిశీలించి కేసుల వారీగా వాస్తవాలను క్రోడీకరిస్తూ చర్యలు చేపడుతున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. బ్యాంకుల్లో పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు భారీ రుణాల ఎగవేత కేసులు పేరుకుపోతున్న క్రమంలో ఆర్బీఐ వెల్లడించన గణాంకాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
పోలీసులపై దాడి: ఆరుగురు మహిళలపై కేసులు
థానె: పోలీసులపై దాడి చేసిన ఆరుగురు మహిళలపై కేసు నమోదు చేశారు. ఓ చీటింగ్ కేసులో నిందితుడిని అరెస్టు చేసేందుకు భీవండిలోని పిరనిపాద వెళ్లిన భీవండి క్రైం యూనిట్, ఓషివర పోలీసులపై అక్కడి మహిళలు ఆరుగురు దాడిచేశారని థానే పోలీసు ప్రతినిధి సుఖదా నర్కర్ తెలిపారు. ఓషివర పోలీసు స్టేషన్లో చీటింగ్, వంచన కేసులు నమోదైన వ్యక్తి కమర్ అలి జాఫ్రి పిరనిపాదలో ఉంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు, భీవండి క్రైం యూనిట్ సంయుక్తంగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి అతని ఇంటిని గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకుంటుండగా ఆరుగురు మహిళలు పోలీసులపై దాడిచేసి కొట్టడమేగాక కొందరి యూనిఫాంలను చింపేశారని, రాళ్లు రువ్వారని తెలిపారు. శాంతినగర్ పోలీసు స్టేషన్లో ఈ మహిళలపై ఐపీసీ 353(ప్రభుత్వ ఉద్యోగిపై దాడిచేయడం, విధులకు ఆటంకం కలిగించడం), 332 కింద కేసులు నమోదు చేసినట్లు సుఖదా నర్కర్ తెలిపారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందన్నారు. -
జాతీయ రహదారిపై విజిలెన్స్ తనిఖీలు
14 వాహనాలపై కేసులు వెంకటాచలం : వెంకటాచలం సమీపంలో జాతీయ రహదారిపై విజిలెన్స్ అధికారులు బుధవారం తెల్లవారు జామున నుంచి ముమ్మరంగా తనిఖీలు చేశారు. వెంకటాచలం టోల్‌ప్లాజా నుంచి కృష్ణపట్నంపోర్టు రోడ్డు వరకు రెండు బృందాలుగా ఏర్పడి రాకపోకలు కొనసాగించే వాహనాలను తనిఖీ చేశారు. విజిలెన్స్ డీఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి మాట్లాడుతూ విజిలెన్స్ ఎస్పీ రమేషయ్య ఆదేశాల మేరకు తనిఖీ నిర్వహించామన్నారు.14వాహనాలు అధిక లోడుతో వెళ్తున్నట్లు గుర్తించామన్నారు. వాటిలో 9 బొగ్గు రవాణా చేస్తున్న లారీలు, రెండు గ్రానైట్, రెండు పార్శిల్, ఒక కంకర లోడు లారీ ఉన్నట్లు చెప్పారు. వీటిపై కేసులు నమోదు చేసి ట్యాక్స్, అధిక లోడుతో వెళ్లినందుకు పన్ను వసూలు చేస్తామని తెలియజేశారు. ఆయన వెంట సీఐలు శ్రీనివాసరావు, ఉప్పల సత్యనారాయణ, బీటీ నాయక్, డీసీటీఓ రవికుమార్, ఎఫ్ఆర్ఓ ఉమామహేశ్వరరెడ్డి, ఏజీ రాము తదితరులు ఉన్నారు. -
విద్యుత్ చౌర్యంపై కేసులు
రూ.30లక్షల అపరాధరుసుం విధింపు నెల్లూరు(టౌన్) : జిల్లా వ్యాప్తంగా విద్యుత్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో మంగళవారం విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న 138 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మనోహరరావు తెలిపారు. నెల్లూరులోని విద్యుత్ భవన్లో ఉన్న విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కృష్ణా, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూల్ జిల్లాల నుంచి వచ్చిన 120 మంది విజిలెన్స్, ట్రాన్స్‌కో అధికారులు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారన్నారు. కొండాపురం, కలిగిరి, కావలి రూరల్, బోగోలు, దగదర్తి, సంఘం, నెల్లూరు రూరల్, ముత్తుకూరు, సైదాపురం, రాపూరు, నాయుడుపేట రూరల్, డక్కిలి ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న 138మందిపై కేసులు నమోదు చేసి, వారికి రూ.30 లక్షలు అపరాధ రుసుం విధించినట్లు తెలిపారు. వాటిలో 61 మీటరు బైపాస్, 50 లైన్ నుంచి నేరుగా కనెక్షన్, 10 గృహా సర్వీసులు వ్యాపారానికి వినియోగం, 17 అదనపు లోడ్లు ఉన్నాయన్నారు. కావలి రూరల్, బోగోలు ప్రాంతాల్లో విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న 24 మంది ఆక్వా వినియోగదారులపై కేసులు నమోదు చేసి రూ.20 లక్షలు వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టేందుకు రానున్న రోజుల్లో మరిన్ని తనిఖీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో డీపీఈ ఎస్ఈ రవి, నెల్లూరు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సీఐ నాగేశ్వరమ్మ పాల్గొన్నారు.