'ఆధార్ కోసం అమ్మను చంపేశాడు' | Man axes mother to death after she fails to find his voter ID card | Sakshi
Sakshi News home page

'ఆధార్ కోసం అమ్మను చంపేశాడు'

Published Mon, Nov 23 2015 10:23 AM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM

'ఆధార్ కోసం అమ్మను చంపేశాడు' - Sakshi

'ఆధార్ కోసం అమ్మను చంపేశాడు'

జంషెడ్పూర్: ఓ కుమారుడి క్షణికావేశం ఓ తల్లి ప్రాణాలు పోవడానికి కారణమైంది. కన్నకొడుకు చేతిలో ఆ తల్లి దారుణ హత్యకు గురైంది. ఆధార్ కార్డు ఇవ్వలేకపోయిందనే ఆగ్రహంతో ఊగిపోయిన కుమారుడు గొడ్డలితో నరికి చంపేసిన ఘటన జంషెడ్ పూర్ లో చోటు చేసుకుంది. ఆదివారం జంషెడ్ పూర్ లో స్థానిక ఎన్నికలు జరిగాయి.

ఈ ఎన్నికల్లో తన ఓటును వినియోగించుకునేందుకు కత్తి(35) అనే వ్యక్తి తన ఆధార్ కార్డు ఇవ్వాల్సిందిగా తల్లి కౌషలియా(55)ను కోరాడు. అయితే, ఆమె ఎంత వెతికినా దొరకక పోవడంతో ఆగ్రహానికి లోనయ్యాడు. ఎక్కడపెట్టావంటూ మాటలనడంతో ఇరువురి మధ్య తిట్లపరంపర చోటుచేసుకుంది. ఆ వెంటనే అతడు గొడ్డలితో తల్లిపై దాడి చేయడంతో ఆమె తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement