జార్ఖండ్ లో బీజేపీ సానుకూల పవనాలు బలంగా వీస్తున్నాయని ఆ పార్టీ ఎంపీ, భోజ్పురి నటుడు మనోజ్ తివారి అన్నారు.
జమ్షెడ్పూర్: జార్ఖండ్ లో బీజేపీ సానుకూల పవనాలు బలంగా వీస్తున్నాయని ఆ పార్టీ ఎంపీ, భోజ్పురి నటుడు మనోజ్ తివారి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ స్వీప్ చేస్తుందని చెప్పారు. జార్ఖండ్ లో పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
గత 14 ఏళ్లుగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అస్థిరతకు ముగింపు పలకాలని జార్ఖండ్ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. తాను ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ అనుకూలంగా వాతావరణం ఉందని ఆయన తెలిపారు. ఢిల్లీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.