Jharkhand assembly polls
-
జార్ఖండ్ పోలింగ్.. వంతెన పేల్చివేత
రాంచి: జార్ఖండ్ రాష్ట్రంలో మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ప్రారంభమైంది. ఆరు జిల్లాల్లోని 13 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. సిట్టింగ్ మంత్రి, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడి నియోజకవర్గాలు ఈ విడతలో ఉన్నాయి. 37 లక్షల మంది ఓటర్లు మొదటి విడతలో తమ ఓటు హక్కును వినుయోగించుకోనున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వినయ్ కుమార్ చౌబే తెలిపారు. అదేవిధంగా అన్ని పార్టీలకు చెందిన 15 మంది మహళ అభ్యర్థులు, 189 పురుష అభ్యర్థులు వారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్లు ఎన్నికల కమిషనర్ వెల్లడించారు. ఇటీవల నక్సలైట్లు దాడులు చేసిన నేపథ్యంలో లతేహర్, మణిక నియోజకవర్గాల్లో కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు తలెత్తకుండ జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తోంది. ముఖ్యంగా ఈ రెండు నియోజకవర్గాల్లో శాంతియుతంగా పోలింగ్ జరిగేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.కాగా, నక్సలైట్లు ఈ రోజు గుమ్లా జిల్లాలోని బిష్ణుపూర్‌లో ఓ వంతెను పేల్చి వేశారు. ఈ ఘటనలో ఎవరి ఎటువంటి ప్రమాదం జరగలేదని డిప్యూటి కమిషనర్ శశి రంజన్ పేర్కొన్నారు. ఈ ఘటన వల్ల పోలింగ్‌కు ఎటువంటి అంతరాయం కలుగదని తెలిపారు. ఓటింగ్ జరిగే నియోజకవర్గాల్లో ప్రజలు భయాదోళనలకు గురికాకుండా ఓటుహక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. మొదటి విడత పోలిగ్ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్రమోదీ.. ‘ఈ రెండు నియోజకవర్గాల్లో జరిగే పోలింగ్‌లో ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని.. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్య పండగను సుసంపన్నం చేయాలి’ అని ట్విటర్లో ప్రజలకు పిలుపునిచ్చారు ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం: లోహర్దగా: 11.68% డాల్టన్‌గంజ్: 10.07% పాంకి: 9.02% బిష్రాంపూర్: 9.5% ఛతర్పూర్ (ఎస్సీ): 10.08% హుస్సేనాబాద్: 09.07% గర్హ్వా: 11% భవనాథ్పూర్: 10% చత్రా (ఎస్సీ): 12.26% లాతేహర్ (ఎస్సీ): 13.25% జార్ఖండ్ ఎన్నికల పోలింగ్ నెమ్మదిగా పెరుగుతోంది. తాజాగా ఉదయం 11 గంటల వరకు 27.4 శాతం పోలింగ్ నమోదైంది. -
జార్ఖండ్ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు 52 మంది పేర్లతో ఆదివారం బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది. జంషెడ్‌పుర్ తూర్పు నుంచి ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గిలువా చక్రంధర్‌పుర్ నుంచి పోటీ చేస్తారని పార్టీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పాల్గొన్నారు. కాంగ్రెస్ తొలి జాబితా విడుదల మరోవైపు ఐదుగురు సభ్యులతో కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ రామేశ్వరం ఓరం ఉన్నారు. లోహర్‌దంగా నియోజక వర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 20 వరకు మొత్తం ఐదు దశల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తొలి విడతకు నవంబర్ 13తో నామినేషన్ ప్రక్రియ ముగియనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎమ్ఎమ్), రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్ఎల్డీ) కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి సీఎం అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ప్రకటించారు. మొత్తం 81 అసెంబ్లీ స్థానాల్లో జేఎమ్ఎమ్ 43, కాంగ్రెస్ 31, ఆర్జేడీ 7 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 23న వెల్లడవుతాయి. -
జార్ఖండ్ లో బీజేపీకే పట్టం: మనోజ్ తివారి
జమ్షెడ్పూర్: జార్ఖండ్ లో బీజేపీ సానుకూల పవనాలు బలంగా వీస్తున్నాయని ఆ పార్టీ ఎంపీ, భోజ్‌పురి నటుడు మనోజ్ తివారి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ స్వీప్ చేస్తుందని చెప్పారు. జార్ఖండ్ లో పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గత 14 ఏళ్లుగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అస్థిరతకు ముగింపు పలకాలని జార్ఖండ్ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. తాను ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ అనుకూలంగా వాతావరణం ఉందని ఆయన తెలిపారు. ఢిల్లీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.