పూలకోసం వెళ్లిన 11 ఏళ్ల బాలికపై..!
పూలకోసం వెళ్లిన 11 ఏళ్ల బాలికపై..!
Published Thu, Jan 7 2016 1:36 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM
జంషెడ్‌పూర్: జార్ఖండ్‌లోని జంషెడ్పూర్‌లో కొత్త సంవత్సరం రోజున అమానుషం చోటు చేసుకుంది. పూలకోసం వెళ్లిన పదకొండేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్యచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులందించిన సమాచారం ప్రకారం.. బసదెరా గ్రామానికి చెందిన 11ఏళ్ల బాలిక కొత్తసంవత్సరం రోజున సమీపంలోని అడవిలోకి పువ్వులు తెంపుకోవడం కోసం వెళ్లింది. తిరిగి వస్తుండగా.. కొందరు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం తమ బండారం బయట పడకూడదని పాశవికంగా రాళ్లతో కొట్టి చంపేశారు. అనంతరం అక్కడినుంచి పారిపోయారు.
కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు అంతా గాలించారు. చివరకు అడవిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. పూలకోసం వెళ్లిన తమ బిడ్డను అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారన్న తల్లిదండ్రుల ఆవేదన గ్రామస్తులను కలిచిచేసింది. అయితే వారం రోజుల తరువాత గ్రామస్తుల సహాయంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ గ్రామానికి చెందినవారే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టి ఉంటారని వారు అనుమానిస్తున్నారు.
Advertisement
Advertisement