jharkhan
-
హేమంత్ సోరెన్ తర్వాత జార్ఖండ్ సీఎం.. కల్పనా సోరెన్ ఎవరు?
జార్ఖండ్ రాజకీయాలు రోజరోజుకీ ఉత్కంఠగా మారాయి. మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రశ్నించేందుకు ఈడీ ప్రయత్నించడం, ఆయన సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మనీలాండరింగ్ కేసులో సీఎం హేమంత్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన భార్య కల్పనా సోరెన్ పేరు తెరమీదకు వచ్చింది. సోరెన్ అరెస్ట్ అయితే కల్పనా తదుపరి జార్ఖండ్ సీఎం అవుతారని జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో తనను ఈడీ అరెస్ట్ చేస్తే భార్యను సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని హేమంత్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఎమ్మెల్యేల సమావేశంలో ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. హేమంత్ సోరెన్.. తన భార్య కల్పనా సోరెన్‌ని ముఖ్యమంత్రి చేసే యోచనలో ఉన్నారని, ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ, జార్ఖండ్ నేత నిషికాంత్ దూబే వ్యాఖ్యలు చేయడం ఈ వార్తలకు మరింత ఊతం ఇస్తున్నాయి. ఒకవేళ అవినీతి కేసుల వల్ల హేమంత్ రాజకీయాలకు దూరం కావాల్సి వస్తే.. పార్టీలో పూర్తిగా చక్రం తిప్పేది కల్పనయే. ఎవరీ కల్పనా కల్పనా సోరెన్ ఎమ్మెల్యే కూడా కాదు. ఆమె రాజకీయంగా ఎలాంటి పదవిలో లేరు. కానీ పార్టీలో ఆమెను ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. రాజకీయాల్లో హేమంత్‌కు ఆమె ముఖ్య విషయాల్లో సలహాలు ఇస్తుంటారనే ప్రచారం ఉంది. కల్పనా ముఖ్యమంత్రి పదవిని చేపడితే... ఆరు నెలల్లోగా ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడే ఓ ట్విట్స్ ఉంది. జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం ఇంకా ఏడాది కంటే తక్కే ఉంది. ఈ సమయంలో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం లేకపోవచ్చు. మరి ఈ సమయంలో రాష్ట్ర రాజకీయాలు ఏ మలుపులు తిరుగుతాయో వేచిచూడాల్సి ఉంది. సేంద్రీయ వ్యవసాయంపై మక్కువ ఇక ఒడిశాలోని మయూర్‌భంజ్‌కు చెందిన కల్పన 1976లో రాంచీలో జన్మించింది. ఆమె తండ్రి వ్యాపారవేత్త కాగా తల్లి గృహిణి. ఇంజనీరింగ్‌లో గ్రాడ్యూయెట్ చేసిన కల్పనా తరువాత ఎంబీఏ చేశారు. ఫిబ్రవరి 7, 2006న హేమంత్ సోరెన్‌ను వివాహం చేసుకుంది. వీరికి నిఖిల్, అన్ష్ ఇద్దరు పిల్లలు. కల్పనా సోరెన్ ఒక పాఠశాలను నడుపుతుండటంతోపాటు సేంద్రీయ వ్యవసాయం కూడా చేస్తున్నారు. చదవండి: మాకు నితీష్ అవసరం లేదు: రాహుల్ 2022లో వార్తల్లోకి దాదాపు రూ. 5 కోట్ల ఖరీదు చేసే మూడు వాణిజ్య భవనాలు ఆమె పేరిట ఉన్నాయి. మహిళలు, పిల్లల సాధికారతపై కార్యక్రమాలకు కూడా తరుచుగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే 2022లో తన భార్యకు(కల్పనా సోరెన్) చెందిన కంపెనీకి పారిశ్రామిక ప్రాంతంలో ప్లాట్‌ను కేటాయించేందుకు సోరెన్ తన పదవిని దుర్వినియోగం చేశారని మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఆరోపణలు చేయడంతో కల్పనా పేరు వార్తల్లో నిలిచింది. 30 గంటల తర్వాత ప్రతక్ష్యం భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఢిల్లీలోని ఆయన నివాసంలో సోమవారం, మంగళవారం సోదాలు జరిపిన విషయం తెలిసిందే. అయితే ఆయన 27వ తేదీ రాత్రి నుంచి అందుబాటులో లేకుండా పోవడంతో ఇంట్లో తనిఖీలు చేపట్టి రూ. 36 లక్షలతోపాటు బీఎండబ్ల్యూకారు, కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 30 గంటల తర్వాత సోరెన్ రాంచీలో ప్రత్యక్షమయ్యారు. మంగళవారం సాయంత్రం రాంచికీ చేరుకొని పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆయన భార్య కల్పనా సోరెన్ కూడా పాల్గొన్నారు. -
ఫార్మర్‌గా ధోని సెకండ్ ఇన్నింగ్స్
రాంచీ: ఇటీవల కాలంలో సెలబ్రిటీలు వ్యవసాయం చేయడం పరిపాటిగా మారింది. లాక్డౌన్లో షూటింగ్‌లు వాయిదా పడటంతో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, సైఫ్‌లు తమ ఫాంలో వ్యవసాయం చేస్తూ బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. అలాగే వీరి జాబితాలో చేరిన టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ పండించిన పంటను విదేశాలకు ఎగుమతి చేయనున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోని తన వ్యవసాయ పొలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ బిజీ అయిపోయిన విషయం తెలిసిందే. అంతేగాక ఆర్గానిక్ పద్దతిలో పండించిన తన పంటను ధోని దుబాయ్‌కి ఎగుమతి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. మాజీ క్రికెటర్ అయిన ధోని ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేయడంతో అతడి పంటను కొనేందుకు దుబాయ్ రైతు మార్కెట్లు ఆసక్తిని కనబరుస్తున్నాయట. (చదవండి: కొత్తజంటకు ధోని డిన్నర్ పార్టీ) దీంతో ధోని సొంత వ్యవసాయ క్షేత్రంలో పండించిన ఆర్గానిక్ పంటకు భారీగా డిమాండ్ వస్తుండటంతో ఈ పంటను విదేశాలకు ఎగుమతి చేసేందుకు జార్ఖండ్ వ్యవసాయ శాఖ ముందుకొచ్చింది. రాంచీ శివార్లలోని సెంబో గ్రామం రింగ్ రోడ్డు వద్ద ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో ధోని స్ట్రాబెర్రీలు, క్యాబేజీ, టమోటాలు, బ్రోకలీ, బఠానీలు, బొప్పాయిల పంటను ఆర్గానిక్ పద్దతిలో పండించాడు. దీంతో ఈ పంటను వ్యవసాయ శాఖ స్వయంగా దుబాయ్‌కి ఎగుమతి చేయనుంది. ఇప్పటికే రాంచీ మార్కెట్లో ధోని పండించిన కూరగాయలు, పళ్లకు భారీ డిమాండ్ ఉంది. ఆల్ సీజన్ ఫాం ఫెష్ ఏజెన్సీ ద్వారా వ్యవసాయ శాఖ గల్ఫ్ దేశాలకు కూరగాయలను పంపింది. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ కింద ధోని పండించిన కూరగాయలను కూడా ఎగుమతి చేయనుందని రాంచీ మార్కెటింగ్ కమిటీ అధిపతి అభిషేక్ ఆనంద్ తెలిపారు. ధోని జార్ఖండ్ రాష్ట్రానికి ఒక బ్రాండ్ అని అతని పేరిట కూరగాయలను విదేశాలకు పంపించడం వల్ల జార్ఖండ్ రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. -
పూలకోసం వెళ్లిన 11 ఏళ్ల బాలికపై..!
జంషెడ్పూర్: జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో కొత్త సంవత్సరం రోజున అమానుషం చోటు చేసుకుంది. పూలకోసం వెళ్లిన పదకొండేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్యచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులందించిన సమాచారం ప్రకారం.. బసదెరా గ్రామానికి చెందిన 11ఏళ్ల బాలిక కొత్తసంవత్సరం రోజున సమీపంలోని అడవిలోకి పువ్వులు తెంపుకోవడం కోసం వెళ్లింది. తిరిగి వస్తుండగా.. కొందరు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం తమ బండారం బయట పడకూడదని పాశవికంగా రాళ్లతో కొట్టి చంపేశారు. అనంతరం అక్కడినుంచి పారిపోయారు. కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు అంతా గాలించారు. చివరకు అడవిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. పూలకోసం వెళ్లిన తమ బిడ్డను అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారన్న తల్లిదండ్రుల ఆవేదన గ్రామస్తులను కలిచిచేసింది. అయితే వారం రోజుల తరువాత గ్రామస్తుల సహాయంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ గ్రామానికి చెందినవారే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టి ఉంటారని వారు అనుమానిస్తున్నారు.