జార్ఖండ్లో చెలరేగిన హింస, కర్ఫ్యూ | Jamshedpur Tense After Clashes Over Alleged Molestation Incident | Sakshi
Sakshi News home page

జార్ఖండ్లో చెలరేగిన హింస, కర్ఫ్యూ

Published Wed, Jul 22 2015 11:42 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

జార్ఖండ్లో  చెలరేగిన హింస,  కర్ఫ్యూ - Sakshi

జార్ఖండ్లో చెలరేగిన హింస, కర్ఫ్యూ

జంషెడ్ పూర్: రాజస్థాన్లోని జంషెడ్పూర్లో  అల్లర్ల చెలరేగడంతో కర్ఫూ విధించారు. భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్  ఇచ్చిన బంద్ పిలుపు ఉద్రిక్తతకు దారి తీసింది.   బీజేపీ అనుబంధ  సంఘమైన రాష్ట్రీయస్వయం సేవక్ కార్యకర్తలు  భారీ ఎత్తున గుమి గూడి ఆందోళనకు  దిగారు.  ఈ సందర్భంగా పోలీసులకు , ఆందోళనకారులకు  మధ్య వాగ్వాదం జరిగింది.  దీంతో  రెచ్చిపోయిన కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వారు  వాహనాలను తగులెబట్టారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలను ధ్వంసం చేశారు.  స్థానికంగా  విధ్వంసం సృస్టించిన ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన దాదాపు 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అధికారులకు కర్ఫ్యూ విధించారు. ఇళ్లలోంచి బయటకు రావద్దంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
 
వదంతులు  వ్యాపించడంతో  అల్లర్లు చెలరేగాయని  పోలీస్ ఉన్నతాధికారి ప్రధాన్ పేర్కొన్నారు.   ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. అయితే  మత్తుమందులకు బానిసలైన కొంతమంది ఉన్మాదుల  కారణంగా  ఉద్రిక్తత  చెలరేగిందని రాష్ట్ర సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు.  మరోవైపు దీనిపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు.  అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్న  ప్రదేశాలలో సీఆర్పీఎఫ్ దళాలను, 15 పారా మిలిటరీ దళాలను మోహరించారు.

కాగా  నగరంలోని  మ్యాంగో ఏరియాలో  సోమవారం రాత్రి ఈ  అల్లర్లకు  బీజం పడింది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్  నటించిన బజరంగీ భాయిజాన్  సినిమా చూసి తిరిగి వస్తున్న అమ్మాయిలను వేధించారు. మూడు  బైక్లపై వచ్చిన  కొంతమంది యువకులు అమ్మాయిలపై  దాడిచేసి , వారి ముసుగులను  తాగేశారు.  దీనిని ప్రశ్నించినవారిని  కత్తులు, తుపాకీలతో  బెదిరించారు. అసభ్య పదజాలంతో  దూషించారు.  దీంతో వివాదం రాజుకుంది. 

 ఈ నేపథ్యంలో లైంగిక వేధింపులకు గురైన అమ్మాయిలకుచెందిన వారు ఆందోళనకు దిగారు.  బాధ్యులను అరెస్ట్ చేయాల్సిందిగా  డిమాండ్ చేస్తూ  రోడ్లను దిగ్బంధించారు.  ఈ సందర్భంగా పోలీసులు ఉద్రిక్తతలను చల్లార్చడానికి  నిషేధాజ్ఞలను జారీ చేసినప్పటికి ఫలితం లేకపోయింది.   వీరి ఆందోళనకు నిరసనగా భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్  కార్యకర్తలు బంద్కు పిలుపునిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement