ఐదేళ్ల చిన్నారిపై టీనేజ్ యువకుడు అత్యాచారం | 5-year-old tribal girl raped by teenager | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల చిన్నారిపై టీనేజ్ యువకుడు అత్యాచారం

Published Thu, Dec 5 2013 10:01 AM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM

5-year-old tribal girl raped by teenager

జంషెడ్పూర్లోని కుట్కుడింగిర్ ప్రాంతంలో ఓ టీనేజ్ యువకుడు ఐదేళ్ల గిరిజన బాలికపై అత్యాచారం చేశాడు. దాంతో ఆ బాలిక ఏడుస్తు స్థానికులకు జరిగిన విషయాన్ని వెల్లడించింది. దీంతో స్థానికులు ఆ యువకుడిని పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేశారు. ఆ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు.

 

ఆ బాలిక తల్లితండ్రులు ఇద్దరు దినసరి వేతన కూలీలని పోలీసులు వెల్లడించారు. దాంతో ఆ పాపను ఎదురుగా ఉన్న చుట్టాల ఇంటివద్ద ఉంచి వారు పనులకు వెళ్లారు.అయితే బంధువులు కూడా బయటకు వెళ్లటంతో ఆ పాప ఒంటరిగా ఇంట్లో ఉంది. అది గమనించిన స్థానిక యువకుడు ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఆ  ఘటన బుధవారం చోటు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement