Asia Cup 2022 Squad: Check Here Full Players List Of All Teams Including India, Pakistan, Sri Lanka, Bangladesh And More - Sakshi
Sakshi News home page

Asia Cup 2022: ఆసియా కప్‌ టోర్నీలో పాల్గొనబోయే టీమ్‌లు.. అన్ని జట్ల ఆటగాళ్ల వివరాలు

Published Wed, Aug 24 2022 7:05 PM | Last Updated on Fri, Aug 26 2022 11:25 AM

Asia Cup 2022: Check All The Squads Full Players List Including India Pakistan - Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ- పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం(PC: BCCI/PCB)

Asia Cup 2022- All Squads: క్రికెట్‌ ప్రపంచంలో ప్రస్తుతం ఆసియా కప్‌ ఫీవర్‌ నడుస్తోంది. మొత్తం ఆరు జట్లు తలపడనున్న ఈ మెగా ఈవెంట్‌లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. కొత్త కెప్టెన్‌.. యువ ఆటగాళ్ల రాక నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో.. టోర్నీలో అడుగుపెట్టనుంది భారత్‌. 

మరోవైపు దాయాది జట్టు పాకిస్తాన్‌ సైతం గట్టిపోటీనిచ్చేందుకు సిద్ధమవుతోంది. శ్రీలంక, అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ ఇలా ఎన్ని జట్లు ఉన్నా కళ్లన్నీ భారత్‌, పాకిస్తాన్‌పైనే ఉన్నాయి. ఈ ఐదు దేశాలతో పాటు క్వాలిఫైయర్స్‌లో కువైట్‌, సింగపూర్‌, యూఏఈలతో తలపడి టాపర్‌గా నిలిచిన హాంకాంగ్‌ జట్టు ఈవెంట్‌లో పాల్గొనబోతోంది. ఇక ఆగష్టు 27న ఆరంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే టీమిండియా, పాకిస్తాన్‌, శ్రీలంక, అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ తమ జట్లను ప్రకటించాయి. ఆ వివరాలు..


PC: BCCI

గ్రూప్‌-ఏలో భారత్‌, పాకిస్తాన్‌ ఉన్నాయి. క్వాలిఫైయర్స్‌లో గెలిచిన జట్టు ఈ గ్రూపులో ప్రవేశిస్తుంది.
భారత్‌
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌, దీపక్‌ హుడా, దినేశ్‌ కార్తిక్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, యజువేంద్ర చహల్‌, రవి బిష్ణోయి, భువనేశ్వర్‌కుమార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఆవేశ్‌ ఖాన్‌

స్టాండ్‌బై ప్లేయర్లు: శ్రేయస్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌, దీపక్‌ చహర్‌


PC: PCB

పాకిస్తాన్‌
బాబర్‌ ఆజం(కెప్టెన్‌), షాబాద్‌ ఖాన్‌, ఆసిఫ్‌ అలీ, ఫఖర్‌ జమాన్‌, హైదర్‌ అలీ, హారిస్‌ రవూఫ్‌, ఇఫ్తికర్‌ అహ్మద్‌, ఖుష్‌దిల్‌ షా, మహ్మద్‌ నవాజ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌, మహ్మద్‌ వసీం జూనియర్‌, నసీం షా, షానవాజ్‌ దహాని, ఉస్మాన్‌ ఖాదిర్‌, మహ్మద్‌ హస్నైన్‌.


PC: ACB

గ్రూప్‌- బి
ఆఫ్గనిస్తాన్‌:
మహ్మద్‌ నబీ(కెప్టెన్‌), రహ్మనుల్లా గుర్బాజ్‌(వికెట్‌ కీపర్‌), హజ్రతుల్లా జజాయ్‌, నజీబుల్లా జద్రాన్‌, హష్మతుల్లా షాహిది, అఫ్సర్‌ జజాయ్‌, కరీం జనత్‌, అజ్మతుల్లా ఒమర్జాయ్‌, సమీముల్లా శిన్వారి, రషీద్‌ ఖాన్‌, ఫజల్‌ హక్‌ ఫారుకీ, ఫరీద్‌ అహ్మద్‌ మాలిక్‌, నవీన్‌ ఉల్‌ హక్‌, నూర్‌ అహ్మద్‌, ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌, ఇబ్రహీం జద్రాన్‌, ఉస్మాన్‌ ఘని.

రిజర్వు ప్లేయర్లు:
కైస్‌ అహ్మద్‌, షరాఫుద్దీన్‌ అష్రఫ్‌, నిజత్‌ మసూద్‌.


PC: Bangaldesh Cricket

బంగ్లాదేశ్‌
షకీబ్‌ అల్‌ హసన్‌(కెప్టెన్‌), అనముల్‌ హక్‌, ముష్ఫికర్‌ రహీం, ఆఫిఫ్‌ హొసేన్‌, మొసద్దెక్‌ హొసేన్‌, మహ్మదుల్లా, మెహెది హసన్‌, మహ్మద్‌ సైఫుద్దీన్‌, ముస్తాఫిజుర్‌ రెహమాన్‌, నసూమ్‌ అహ్మద్‌, సబీర్‌ రెహమాన్‌, మెహెది హసన్‌ మీరజ్‌, టస్కిన్‌ అహ్మద్‌, ఎబాదత్‌ హొసేన్‌, పర్వేజ్‌ హొసేన్‌ ఎమాన్‌, మహ్మద్‌ నయీం.


PC: SLC

శ్రీలంక
దసున్‌ షనక(కెప్టెన్‌), ధనుష్క గుణతిలక, పాథుమ్‌ నిశాంక, కుశాల్‌ మెండిస్‌, చరిత్‌ అసలంక, భనుక రాజపక్స, అషేన్‌ బండారా, ధనుంజయ డి సిల్వా, వనిందు హసరంగ, మహీశ్‌ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, ప్రవీణ్‌ జయవిక్రమ, చమిక కరుణరత్నె, దిల్షాన్‌ మదుషంక, మథీష పతిరాణా, నువనిడు ఫెర్నాండో, నువాన్‌ తుషార, దినేశ్‌ చండిమాల్‌.


PC: Hongkong

హాంకాంగ్‌
నిజాకత్‌ ఖాన్‌(కెప్టెన్‌), కించిత్‌ షా, జీషన్‌ అలీ, హరూన్‌ అర్షద్‌, బాబర్‌ హయత్‌, అఫ్తాబ్‌ హొసేన్‌, అతీక్‌ ఇక్బాల్‌, ఎయిజాజ్‌ ఖాన్‌, ఎహ్‌సాన్‌ ఖాన్‌, స్కాట్‌ మెఖినీ, ఘజ్నాఫర్‌ మహ్మద్‌, యాసిమ్‌ మోర్తజా, ధనుంజయ రావు, వాజిద్‌ షా, అయుశ్‌ శుక్లా, అహాన్‌ త్రివేది, మహ్మద్‌ వహీద్‌.


PC: Kuwait

కువైట్‌
మహ్మద్‌ అస్లాం(కెప్టెన్‌), నవాఫ్‌ అహ్మద్‌, మహ్మద్‌ ఆమిన్‌, మీట్‌ భావ్సర్‌(వికెట​ కీపర్‌), అద్నన్‌ ఇద్రీస్‌, ముహ్మద్‌ కాషిఫ్‌, శిరాజ్‌ ఖాన్‌, సయీద్‌ మోనిబ్‌, ఉస్మాన్‌ పటేల్‌, యాసిన్‌ పటేల్‌, షారూఖ్‌ కుద్దూస్‌, రవిజా సాందారువన్‌, మొహ్మద్‌ షఫీక్‌, హరూన్‌ షాహిద్‌, ఎడ్సన్‌ సిల్వా, బిలాల్‌ తాహిర్‌,  అలీ జహీర్‌.


PC: Singapore

సింగపూర్‌
అంజద్‌ మెహబూబ్‌(కెప్టెన్‌), రీజా గజ్నావి, జన్‌ ప్రకాశ్‌, మన్‌ప్రీత్‌ సింగ్‌, వినోత్‌ భాస్కరన్‌, ఆర్యమన్‌ ఉచిల్‌, సురేంద్రన్‌ చంద్రమోహన్‌, రోహన్‌ రంగరాజన్‌, అక్షయ్‌ రూపర్‌ పురి, అమన్‌ దేశాయి, జీవన్‌ సంతానం, విహాన్‌ మహేశ్వరి, ఆర్యవీర్‌ చౌదరి, అరిత్ర దత్తా.

యూఏఈ
చుండంగపోయిల్‌ రిజ్వాన్‌(కెప్టెన్‌), సుల్తాన్‌ అహ్మద్‌, సబీర్‌ అలీ, వ్రిత్య అరవింత్‌, కషిఫ్‌ దావూద్‌, జవార్‌ ఫరీద్‌, బాసిల్‌ హమీద్‌, జహూర్‌ ఖాన్‌, ఆర్యన్‌ లక్రా, కార్తిక్‌ మెయప్పన్‌, రోహన్‌ ముస్తఫా, ఫాహద్‌ నవాజ్‌, అహ్మద్‌ రజా, అలీషాన్‌ షరాఫు, జునైద్‌ సిద్దిఖీ, చిరాగ్‌ సూరి, ముహ్మద్‌ వసీం.

చదవండి: Asia Cup 2022 Ind Vs Pak: మొదటి విజేత మన జట్టే! అప్పుడు పాక్‌ మరీ ఘోరంగా!
ICC ODI Rankings: అదరగొట్టిన శుబ్‌మన్‌ గిల్‌.. ఏకంగా 93 స్థానాలు ఎగబాకి..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement