Asia Cup 2022 Ind Vs Pak: Rohit And Kohli Featured Latest Promo Goes Viral - Sakshi
Sakshi News home page

Asia Cup 2022- Ind Vs Pak: రోహిత్‌ పుల్‌ షాట్లు.. కోహ్లి క్లాసిక్‌ డ్రైవ్స్‌.. అదిరిపోయిన ప్రోమో!

Published Thu, Aug 11 2022 5:41 PM | Last Updated on Thu, Aug 11 2022 6:51 PM

Asia Cup 2022 India Vs Pakistan: Rohit Kohli Featured Latest Promo Viral - Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ- పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం(PC: Star Sports)

Asia Cup 2022- India Vs Pakistan: భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటే క్రికెట్‌ ప్రేమికులకు ఓ పండుగ లాంటిది. దాయాది జట్ల మధ్య పోరుకు ఉన్న క్రేజ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే! ఇటీవలి కాలంలో కేవలం ప్రపంచకప్‌ టోర్నీలు సహా ఆసియా కప్‌ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లలో మాత్రమే ఈ చిరకాల ప్రత్యర్థులు తలపడుతున్నాయి. ఇలా అరుదుగానైనా ఈ మెగా టోర్నీల్లో భారత్‌- పాకిస్తాన్‌ పోటీ పడటం చూసి ఆనందిస్తున్నారు ఫ్యాన్స్‌. 

ఇక దాయాది దేశాల మధ్య మ్యాచ్‌ అంటేనే భావోద్వేగాల సమాహారం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆటగాళ్లు మైదానంలో పోటీ పడుతుంటే.. అభిమానులు కన్నార్పకుండా మరీ మ్యాచ్‌ చూస్తారనడంలో అతిశయోక్తి లేదు. కాగా ఇప్పటి వరకు జరిగిన అన్ని మెగా ఈవెంట్లలో భారత్‌ పైచేయి సాధించగా.. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌-2021లో మాత్రం కోహ్లి సేనకు పాక్‌ చేతిలో పరాభవం ఎదురైన విషయం తెలిసిందే.

కనీవిని ఎరుగని రీతిలో విరాట్‌ కోహ్లి సారథ్యంలోని టీమిండియా ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఎప్పుడెప్పుడు మళ్లీ భారత్‌- పాకిస్తాన్‌ పోటీ పడతాయా? టీమిండియా బదులు తీర్చుకునే సమయం ఎప్పుడు వస్తుందా అని భారత అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆసియా కప్‌-2022 రూపంలో వారి నిరీక్షణకు తెరపడే సమయం రానే వచ్చింది.

ఆగష్టు 27 నుంచి ఈ ఈవెంట్‌ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే రోహిత్‌ సేన- బాబర్‌ బృందంతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ ఇప్పటికే పలు ప్రోమోలు వదిలింది. తాజాగా మరో వీడియోతో ముందుకు వచ్చింది.

‘‘వాళ్లు ప్రత్యర్థులు.. వారి మధ్య పోటీ తీవ్రమైనది.. ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌.. ఇరు జట్లలో స్టార్లు ఉన్నారు? ఈ మహా సంగ్రామంలో ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారు’’ అంటూ క్యాప్షన్‌ జతచేసింది. ‘రోహిత్‌ శర్మ పుల్‌ షాట్లు.. ఫఖర్‌ జమాన్‌ బిగ్‌ హిట్లు... విరాట్‌ కోహ్లి క్లాసిక్‌ డ్రైవ్స్‌.. బాబర్‌ ఆజమ్‌ గ్రేస్‌ఫుల్‌ బ్యాటింగ్‌’’ అంటూ సాగిన ఈ ప్రోమో అభిమానులను ఆకర్షిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి!

చదవండి: Asia Cup 2022: టీమిండియా సెలక్టర్లు చేసిన అతి పెద్ద తప్పు అదే! 
Asia Cup 2022 IND VS PAK: భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సం‍దడి మొదలైంది.. హీటెక్కిస్తున్న హిట్‌మ్యాన్‌ ప్రోమో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement