క్యాచ్‌రిచ్ లీగ్‌గా ముద్రపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ర్యాంకింగ్స్‌లోనూ దూసుకుపోయింది. యుగోవ్స్ 2022 స్పోర్ట్స్ బజ్ ర్యాంకింగ్స్‌లో ఐపీఎల్ అగ్రస్థానంలో నిలించింది. రెండో స్థానంలో టోక్యో ఒలింపిక్స్(సమ్మర్ ఒలింపిక్స్) నిలవగా.. మూడోస్థానంలో ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ మూడో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ఇచ్చినట్లు యుగోవ్స్ తెలిపింది. ఇక ఐపీఎల్ 14వ సీజన్ తొలి అంచె పోటీలు మనదగ్గరే జరగ్గా.. కరోనా విజృంభణతో రెండో అంచె పోటీలు యూఏఈ వేదికగా జరిగింది. అయినప్పటికి భారత అభిమానులను అలరించిన ఐపీఎల్ 50.8 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచింది. కాగా యుగోవ్స్ స్పోర్ట్స్ ర్యాంకింగ్స్‌లో ఐపీఎల్ తొలిస్థానంలో నిలవడం వరుసగా రెండోసారి. గతేడాది ప్రకటించిన ర్యాంకింగ్స్‌లోనూ ఐపీఎల్‌దే తొలిస్థానం.
►ఇక ఐపీఎల్ తర్వాత ఇండియాలో అత్యంత ఎక్కువ జనాధరణ పొందింది టోక్యో ఒలింపిక్స్. 2020లో జరగాల్సిన ఒలింపిక్స్ కరోనా కారణంగా మరుసటి ఏడాదికి వాయిదా పడ్డాయి. దీంతో గతేడాది ఆగస్టులో నిర్వహించిన టోక్యో ఒలింపిక్స్‌లో ఎన్నడూ లేనంతగా మనకు ఏడు పతకాలు రావడం విశేషం. ఇందులో నీరజ్ చోప్రా స్వర్ణం గెలవడం చరిత్రలో నిలిచిపోయింది. 49.2 పాయింట్లతో .. కేవలం 1.6 పాయింట్ల తేడాతో తొలిస్థానం కోల్పోయినప్పటికి.. రెండోస్థానంలో నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది.
►సాధారణంగా ఐసీసీ టోర్నీలు జరిగితే ఇండియాలో ఎక్కువమంది చూస్తుంటారు. కానీ గతేడాది జరిగిన ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో టీమిండియా నిరాశపరిచింది. సూపర్-12 దశలోనే ఇంటిబాట పట్టినప్పటికి.. ఐసీసీ టోర్నీని ఇండియా అభిమానులు ఆదరించారని సర్వేలో తేలింది. 45.9 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచిన ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్.. అంతకముందు ఇచ్చిన స్కోరు కంటే 0.4 మాత్రమే తక్కువగా ఉండడం విశేషం.
►ఈ మూడింటి తర్వాత ఫుట్‌బాల్ వరల్డ్‌కప్(28.3 పాయింట్లు), ఇండియన్ సూపర్ లీగ్(20.4 పాయింట్లు), వింబుల్డన్ చాంపియన్‌షిప్(టెన్నిస్, 18 పాయింట్లు) వరుసగా 4,5,6 స్థానాల్లో నిలవగా.. ప్రొ కబడ్డీ లీగ్ 17.9 పాయింట్లతో ఏడోస్థానం.. ఏసియన్ గేమ్స్ 15.3 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది. ఇక తొమ్మిదో స్థానంలో వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ) 13.3.. ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ 13 పాయింట్లతో తొమ్మిది, 10 స్థానాల్లో ఉన్నాయి. ఇక యుగోవ్స్ తమ ర్యాంకింగ్స్‌ను స్పోర్ట్స్ ఇండెక్స్ రోజువారీగా బ్రాండ్‌ల పట్ల ప్రజల అవగాహనను కొలమానంలోకి తీసుకొని నిర్థారణ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment