బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ మెగా వేలంలో తొలి రోజు చిన్న అపశ్రుతి చోటు చేసుకుంది. ఆటగాళ్ల వేలం నిర్వహించేందుకు వచ్చిన ప్రముఖ వేలంపాటదారు హ్యూజ్ ఎడ్మీడ్స్ వేలం జరుగుతుండగానే కుప్పకూలారు. ఉన్నపళంగా లో బీపీ (అల్ప రక్తపోటు)కి గురయ్యారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించడంతో పాటు... ప్రక్రియకు ఆటంకం కలుగకుండా వెంటనే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వేలంపాట బాధ్యతల్ని సుప్రసిద్ధ క్రీడా వ్యాఖ్యాత చారు శర్మకు అప్పగిం చింది.
శనివారం శ్రీలంక క్రికెటర్ వనిందు హసరంగ పేరు వేలానికి పిలిచిన సమయంలో 60 ఏళ్ల హ్యూజ్ ఎడ్మీడ్స్ రక్తపోటు ఉన్నపళంగా పడిపోయింది. నిల్చున్న చోటే కుప్పకూలిన ఆయన్ని సత్వరం ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఐపీఎల్ వర్గాలు పేర్కొన్నాయి. ఎడ్మీడ్స్ ప్రపంచ వ్యాప్తంగా 2700 పైచిలుకు వేలం పాటలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment