PC: IPL
Report: No More Mega Auctions After IPL 2022 Franchises To Create Own Ecosystems: ఇండియన్ ప్రీమియర్ లీగ్.. బీసీసీఐ, ఆటగాళ్లకు, ఫ్రాంఛైజీలకు కాసులు కురిపించే ఈ క్యాష్ రిచ్ లీగ్‌పై క్రీడాభిమానుల్లో ఆసక్తి మెండు. ఇప్పటికే విజయవంతంగా 14 సీజన్లు పూర్తి చేసుకున్న ఐపీఎల్ వచ్చే ఏడాది రెండు జట్ల రాకతో మరింత రసవత్తరంగా మారనుంది. ఈ క్రమంలో మెగా వేలం-2022 నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రిటెన్షన్(అట్టిపెట్టుకునే ఆటగాళ్లు)కు సంబంధించి నవంబరు 30న తుది జాబితా సమర్పించేందుకు ఫ్రాంఛైజీలు సిద్ధమైనట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఏ జట్టు ఏ ఆటగాడిని కొనసాగిస్తుంది? ఎవరిని వదులుకుంటుంది? వేలంలో ఎవరు ఎంత ధర పలుకుతారు? అన్న విషయాలపై ఆసక్తి నెలకొంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శ్రీనివాస్ రావు అనే నెటిజన్ బంపర్ అనౌన్స్‌మెంట్ అంటూ ఓ ‘బాంబు’ పేల్చాడు. ఐపీఎల్-2022 మెగా వేలమే చివరిదని, ఇకపై ఐపీఎల్‌లో వేలం ఉండబోదంటూ వ్యాఖ్యానించాడు.
ఈ మేరకు.. ‘‘ఇదే చివరి మెగా వేలం. దీని తర్వాత ఫ్రాంఛైజీలు తమకంటూ సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాయని భావిస్తున్నా. వేలం అనేది పాత పద్ధతి.. దానికి కాలం చెల్లింది. కాబట్టి ఇకపై మెగా వేలం ఉండబోదని అనుకుంటున్నా’’ అని ట్వీట్ చేశాడు. ఇందుకు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘‘నిజంగా ఇదే చివరి మెగా వేలం అయితే.. జట్లు చాలా సీరియస్‌గానే ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటాయి. బిగ్‌బాష్ మాదిరి డ్రాఫ్ట్ సిస్టమ్ ఉంటే ఐపీఎల్‌కు మేలే జరుగుతుంది. నేరుగా ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేస్తారా ఏంటి?’’ అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: Ind Vs Nz Test Series: డ్రా.. అంపైర్ల నిర్ణయం సరైందే; మరి రెండో టెస్టులో రహానేపై వేటు?!
IPL 2022 Auction: రాహుల్, రషీద్ ఖాన్‌ను లాక్కొన్నారు.. పంజాబ్, హైదరాబాద్ లబోదిబో!
Bumper announcement: This is probably the last #IPL mega auction. After this, franchises have to work on -- and create -- their own ecosystems.
— KSR (@KShriniwasRao) November 29, 2021
After this no mega auction for quite time (I guess forever).
P.s.... as it is, I think auctions have gone past their sell by date.
Comments
Please login to add a commentAdd a comment