స్టార్ ఇండియాలో మా టీవీ విలీనం పూర్తి | Star India completes integration of Maa TV Network | Sakshi
Sakshi News home page

స్టార్ ఇండియాలో మా టీవీ విలీనం పూర్తి

Dec 4 2015 2:41 AM | Updated on Sep 3 2017 1:26 PM

స్టార్ ఇండియాలో మా టీవీ విలీనం పూర్తి

స్టార్ ఇండియాలో మా టీవీ విలీనం పూర్తి

మా టెలివిజన్ నెట్‌వర్క్ విలీన ప్రక్రియ పూర్తయినట్లు స్టార్ ఇండియా ప్రకటించింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మా టెలివిజన్ నెట్‌వర్క్ విలీన ప్రక్రియ పూర్తయినట్లు స్టార్ ఇండియా ప్రకటించింది.  మా టెలివిజన్ నెట్‌వర్క్‌కు చెందిన మా టీవీ, మా గోల్డ్, మా మ్యూజిక్, మా సినిమా చానల్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా దిగ్గజం రూపక్ మర్డోక్‌కు చెందిన ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్‌కు చెందిన స్టార్ ఇండియా గ్రూపు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఈ విలీనం అధికారికంగా పూర్తయ్యిందని స్టార్ ఇండియా ప్రకటించింది. దీంతో తెలుగు టెలివిజన్ విభాగంలో కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి అవకాశం ఏర్పడుతుందని స్టార్ ఇండియా సీఈవో ఉదయ్ శంకర్ తెలిపారు. ప్రస్తుతం స్టార్ ఇండియా ఎనిమిది భాషల్లో 40 టెలివిజన్ చానల్స్‌ను కలిగి ఉంది. మా టీవీలో పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌తో పాటు సినీ నటులు నాగార్జున, చిరంజీవి కుటుంబాలకు వాటా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం విలువ రూ. 2,500 కోట్లు ఉండొచ్చన్నది మార్కెట్ వర్గాల అంచనా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement