టీమిండియా మ్యాచ్‌ల ప్రసార హక్కుల వేలం విషయంలో ఉత్కంఠ వీడింది. కళ్లు చెదిరే రేటును బీసీసీఐకి చెల్లిస్తూ స్టార్ ఇండియా నెట్‌వర్క్ సంస్థ ప్రసార హక్కులను దక్కించుకుంది. అధికారిక సమాచారం ప్రకారం రూ. 6,138.10 కోట్లకు హక్కులు అమ్ముడు పోయినట్లు సమాచారం. 2018-2023 ఐదేళ్ల కాలానికి మీడియా హక్కులను కైవసం చేసుకుంది.
ఐసీసీ షెడ్యూల్ ప్రకారం టీమిండియా 2018-19కిగానూ 18 మ్యాచ్‌లు, 2019-20కి గానూ 26, 2020-21కిగానూ 14, 2021-22కిగానూ 23, 2022-23కిగానూ 21 మ్యాచ్‌లు ఆడనుంది. ఆలెక్కన 102 మ్యాచ్‌లకు సగటున ఒక్కోమ్యాచ్‌కు రూ.60.1 కోట్లను స్టార్ సంస్థ చెల్లించినట్లు తెలుస్తోంది. దేశివాళీ మ్యాచ్‌లతోపాటు మహిళా క్రికెట్ మ్యాచ్‌లను కూడా స్టార్ నెట్‌వర్క్ ప్రసారం చేస్తుంది. వీటితోపాటు 2018-2022ల మధ్య ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసార హక్కులను కూడా స్టార్ ఇండియానే కైవసం చేసుకుంది. గతంలో 2012-18 మధ్య హక్కులను రూ.3851 కోట్లకు స్టార్ ఇండియానే కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment