సాక్షి, ముంబై: ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం డిస్నీ మరోసారి ఉద్యోగులకు చేదువార్త చెప్పింది. మూడో రౌండ్ తొలగింపులను షురూ చేసింది. ఈ నిర్ణయం అంతటా 2,500 మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఖర్చులను తగ్గించే చర్యలో భాగంగా, కంపెనీ ఈ వారం తన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి డజన్ల కొద్దీ టైటిల్స్‌ను తొలగిస్తోంది.
నివేదిక ప్రకారం, తీవ్రంగా దెబ్బతిన్న టెలివిజన్ విభాగం, రెండో రౌండ్ ఉద్యోగాల కోతకు నిర్ణయించింది. ఉద్యోగుల తొలగింపులు,ఇతర వ్యయ-తగ్గింపు చర్యల ద్వారా 5.5 బిలియన్ డాలర్లను ఆదా చేయాలనే ప్రణాళికలను ఫిబ్రవరిలో ప్రకటించింది. (వార్నీ.. రేఖలా మారిపోయిన అమితాబ్, అందంగా సల్మాన్ ఖాన్)
🚨 Disney Started 3rd Round of Layoffs, 2500 Employees Expected to Lose their Jobs
— Ravisutanjani (@Ravisutanjani) May 23, 2023
Reliance’s JioMart also Fired 1000 Employees, More Layoffs In the Next Few Weeks
Very Difficult Times for Affected Employees
కాగా డిస్నీ సీఈవో బాబ్ ఇగెర్ మూడు రౌండ్ల తొలగింపులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటి రౌండ్ లేఆఫ్స్ మార్చిలోనే షురూ అయ్యాయి. రెండో రౌండ్‌లో ఏప్రిల్‌లో 4వేల మంది ఉద్యోగులను తొలగించింది. మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 7,000 మంది కార్మికులకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబరు 1 నాటికి, డిస్నీకి 220,000 మంది ఉద్యోగులు ఉన్నారు . (ఫేస్‌బుక్ మెటాకు భారీ షాక్: ఏకంగా 10వేల కోట్ల జరిమానా)
మరిన్ని ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్, తాజా వార్తల కోసం చదవండి: సాక్షి,బిజినెస్
Comments
Please login to add a commentAdd a comment