
Disney Plus Hotstar lost subscribers: స్ట్రీమింగ్ సర్వీస్ కంపెనీ ‘డిస్నీ ఫ్లస్’ (Disney+) సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఏడాది కాలంలో ఏకంగా 60 శాతం సబ్ స్క్రయిబింగ్ రేట్‌తో సంచలనం సృష్టించింది. అక్టోబర్ 2నాటికి మొత్తం 118.1 మిలియన్‌ల సబ్‌స్క్రయిబర్ల మార్క్‌ను చేరుకున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
అయితే.. మూడు నెలల వ్యవధిలో 2.1 మిలియన్ సబ్‌స్క్రయిబర్లను మాత్రమే చేర్చుకుని స్వల్ఫ తగ్గుదలతోనే 118.1 మిలియన్ ఫీట్ సాధించడం విశేషం. ఇక ఈ వ్యవధిలోనే భారత్‌లో మాత్రం డిస్నీ ఫ్లస్‌కు భారీ దెబ్బ పడింది. ఇండియన్ వెర్షన్ సర్వీస్ ‘డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్’ సబ్ స్క్రయిబర్స్‌ను భారీగా కోల్పోయింది. ఏకంగా 20 లక్షల మంది సబ్‌స్క్రయిబర్లు దూరమైనట్లు గణాంకాలు చెప్తున్నాయి.
కానీ, అమెరికా, ఇతర ఇంటర్నేషనల్ మార్కెట్‌లో మాత్రం డిస్నీ ఫ్లస్‌కు భారీగా సబ్ స్క్రయిబర్లు పెరగడం విశేషం. కొత్తగా ప్రారంభించిన ‘స్ట్రీమింగ్ వార్స్’కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది ఇప్పుడు. గత మూడు నెలల వ్యవధిలో యూఎస్, యూరప్‌లలో డిస్నీ ఫ్లస్‌కు 40 లక్షల కొత్త సబ్ స్క్రయిబర్లు చేరడం గమనార్హం. వివిధ రకాల సర్వీసులతో ‘డిస్నీ ఫ్లస్’ను రెండేళ్ల క్రితం ప్రారంభించిన విషయం తెలిసిందే.