stream online
-
Hotstar: డిస్నీ ఫ్లస్కు భారత్‌లో భారీ దెబ్బ
Disney Plus Hotstar lost subscribers: స్ట్రీమింగ్ సర్వీస్ కంపెనీ ‘డిస్నీ ఫ్లస్’ (Disney+) సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఏడాది కాలంలో ఏకంగా 60 శాతం సబ్ స్క్రయిబింగ్ రేట్‌తో సంచలనం సృష్టించింది. అక్టోబర్ 2నాటికి మొత్తం 118.1 మిలియన్ల సబ్స్క్రయిబర్ల మార్క్‌ను చేరుకున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే.. మూడు నెలల వ్యవధిలో 2.1 మిలియన్ సబ్స్క్రయిబర్లను మాత్రమే చేర్చుకుని స్వల్ఫ తగ్గుదలతోనే 118.1 మిలియన్ ఫీట్ సాధించడం విశేషం. ఇక ఈ వ్యవధిలోనే భారత్‌లో మాత్రం డిస్నీ ఫ్లస్కు భారీ దెబ్బ పడింది. ఇండియన్ వెర్షన్ సర్వీస్ ‘డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్’ సబ్ స్క్రయిబర్స్ను భారీగా కోల్పోయింది. ఏకంగా 20 లక్షల మంది సబ్స్క్రయిబర్లు దూరమైనట్లు గణాంకాలు చెప్తున్నాయి. కానీ, అమెరికా, ఇతర ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం డిస్నీ ఫ్లస్కు భారీగా సబ్ స్క్రయిబర్లు పెరగడం విశేషం. కొత్తగా ప్రారంభించిన ‘స్ట్రీమింగ్ వార్స్’కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది ఇప్పుడు. గత మూడు నెలల వ్యవధిలో యూఎస్, యూరప్‌లలో డిస్నీ ఫ్లస్కు 40 లక్షల కొత్త సబ్ స్క్రయిబర్లు చేరడం గమనార్హం. వివిధ రకాల సర్వీసులతో ‘డిస్నీ ఫ్లస్’ను రెండేళ్ల క్రితం ప్రారంభించిన విషయం తెలిసిందే. చదవండి: ప్లాస్టిక్ నుంచి పెట్రోల్..అందుబాటులో ఎప్పుడంటే ? -
అమెజాన్ ప్రైమ్‌లో "A- Ad Infinitum"
అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సూపర్ హిట్ థ్రిల్లర్ చిత్రం "A- Ad Infinitum". అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై గీతా మిన్సాల నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ని తెచ్చుకుంది. నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. డిఫరెంట్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో నూటికి నూరు శాతం సఫలమయ్యింది. ఈ సినిమా పై మొదటినుంచి మంచి అంచనాలు ఉండగా విడుదలైన తొలిరోజు నుంచే బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ని సొంతం చేసుకుంది. మొదటి ఆటనుంచే ట్రెమండస్ రెస్పాన్స్ రాబట్టుకోవడమే కాకుండా విభిన్నమైన కాన్సెప్ట్ ఉన్న సినిమాగా విమర్శకుల ప్రశంశలు సంపాదించుకుంది. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది అని ప్రేక్షకులు చెప్తున్నారు.. విజయ్ కురాకుల సంగీతంకు మంచి పేరు రాగా అనంత్ శ్రీరామ్ అద్భుతమైన సాహిత్యాన్నీ అందించారని కితాబు దక్కించుకున్నాడు. తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.. థియేటర్లలో ఈ సినిమాకి ఉన్న డిమాండ్ చూసి అమెజాన్ ఫాన్సీ ధరకు ఈ సినిమాను కొనుగోలు చేసింది. కాగా ప్రస్తుతం అమెజాన్‌లో కూడా ఈ సినిమా ఇతర టాప్ సినిమాలకు పోటీ గా నిలుస్తుంది.. చదవండి :ఆసక్తిని రేకిస్తున్న ‘పీనట్ డైమండ్’ టీజర్ ఆచార్య.. స్టోరీ లైన్ తెలిసిపోయింది! -
ఫస్ట్ టైమ్ ఆన్లైన్లో ఆస్కార్ వేడుక!
ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆస్కార్ పండగ సందడి మొదలైంది. ఈరోజు సాయంత్రం లాస్ ఏంజిల్స్‌లో సుమారు ఐదున్నర గంటలకు డాల్బీ థియేటర్లో ఆరంభమవుతుంది ఈ వేడుక. మన భారతీయ కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజాము అన్నమాట. ఈ వేడుకను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 225 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది ఆస్కార్ కమిటీ మరో అడుగు ముందుకేసింది. ఆన్లైన్లో ఆస్కార్ వేడుకను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే అవకాశం కల్పిస్తోంది. అయితే యూఎస్‌లో ఉన్నవారికి మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని సమాచారం.