అమెజాన్‌ ప్రైమ్‌లో "A- Ad Infinitum" | Super Hit Thriller A- Ad Infinitum Streaming On Amazon | Sakshi
Sakshi News home page

అమెజాన్‌ ప్రైమ్‌లో "A- Ad Infinitum"

Published Sat, Mar 20 2021 7:03 PM | Last Updated on Thu, Jun 9 2022 6:46 PM

Super Hit Thriller A- Ad Infinitum Streaming On Amazon - Sakshi

అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సూపర్ హిట్  థ్రిల్లర్  చిత్రం "A- Ad Infinitum". అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై గీతా మిన్సాల నిర్మించిన ఈ  చిత్రం ఇటీవలే థియేటర్లలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్‌ని తెచ్చుకుంది. నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. డిఫరెంట్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో నూటికి నూరు శాతం సఫలమయ్యింది. ఈ సినిమా పై మొదటినుంచి మంచి అంచనాలు ఉండగా విడుదలైన తొలిరోజు నుంచే బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌ని  సొంతం చేసుకుంది. 

మొదటి ఆటనుంచే ట్రెమండస్ రెస్పాన్స్ రాబట్టుకోవడమే కాకుండా విభిన్నమైన కాన్సెప్ట్ ఉన్న సినిమాగా విమర్శకుల ప్రశంశలు సంపాదించుకుంది. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది అని ప్రేక్షకులు చెప్తున్నారు.. విజయ్ కురాకుల సంగీతంకు మంచి పేరు రాగా అనంత్ శ్రీరామ్ అద్భుతమైన సాహిత్యాన్నీ అందించారని కితాబు దక్కించుకున్నాడు. తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.. థియేటర్లలో ఈ  సినిమాకి ఉన్న డిమాండ్ చూసి అమెజాన్ ఫాన్సీ ధరకు ఈ సినిమాను కొనుగోలు చేసింది. కాగా ప్రస్తుతం అమెజాన్లో కూడా ఈ సినిమా ఇతర టాప్ సినిమాలకు పోటీ గా నిలుస్తుంది.. 

చదవండి :ఆసక్తిని రేకిస్తున్న ‘పీనట్‌ డైమండ్‌’ టీజర్‌‌
ఆచార్య.. స్టోరీ లైన్‌ తెలిసిపోయింది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement