Ananth Sriram
-
ఘంటసాల తెలుగు పాట చిరునామా మాత్రమే కాదు పాటల సౌధానికి పునాది: అనంత్ శ్రీరామ్
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకుడు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకలు సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదం ఊపందుకున్న విషయం విదితమే. శంకర నేత్రాలయ యు.ఎస్.ఏ. అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో 190 టీవీ చర్చ కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ పాల్గొన్న ఈ ప్రత్యేక కార్యక్రమం, 10 మంది సహ నిర్వాహకులు అయిన రత్నకుమార్ కవుటూరు, శారద ఆకునూరి, రెడ్డి ఉరిమిండి, శ్యాం అప్పాలి, విజు చిలువేరు, నీలిమ గడ్డమణుగు, రామ్ దుర్వాసుల, ఫణి డొక్కా, జయ పీసపాటి, శ్రీలత మగతలతో కలిసి ప్రపంచవ్యాప్తంగా 100 మంది పైగా గాయకులు / గాయనీమణులతో ఘంటసాల శత గళార్చన కార్యక్రమంను నిర్వహించగా.. మొదటి మూడు భాగాలు 21, 28 ఆగస్టు, 4 సెప్టెంబర్ నాడు ప్రసారం చేయగా అనూహ్యమైన స్పందన వచ్చిందని, 11 సెప్టెంబర్ నాడు చివరి భాగం ప్రసారమైందని నిర్వాహకులు తెలిపారు. ముందుగా బాల రెడ్డి ఇందూర్తి శత గళార్చన నాల్గవ (చివరి) భాగంలో పాల్గొన్న ముఖ్యఅతిథి ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ ఘంటసాల అంటే తెలుగు పాటకి చిరునామె కాదు తెలుగు పాటల సౌధానికి పునాది లాంటి వారని కీర్తించారు. ఘంటసాలతోనే తెలుగు పాట ప్రపంచవ్యాప్తమైందన్నారు. అలాగే జర్మనీ లాంటి తెలుగుకి ఏ మాత్రము సంబంధం లేని దేశాలలో కూడా ఆయన ప్రదర్శన అక్కడ ప్రజల్ని ఆకట్టుకుంది అంటే అది తెలుగు బాషాకి ఎంత ఔన్నత్యం ఉందొ తెలుగు బాషాని ప్రాచుర్యం చేసిన ఆయన గొంతుకి కూడా ఉన్నతి, ఆ ఘనత దక్కుతుందన్నారు. పాటలకు చమత్కారం జోడించి పాడటం అనేది అది వారికొక్కరికే సాధ్యమయ్యిందని తెలిపారు. నిజంగా ఇలాంటి గాయకుడు ఉండటం వల్లనే తెలుగు భాష ఇంత పరిఢవిల్లుతుంది అని అనిపించింది.. ఘంటసాల గారి పుష్పవిలాపం, కుంతి విలాపం, గోవిలాపం గాని పద్యాలు మనం వింటే చదువుతున్నప్పుడు ఆ పద్యం లోని భావం అర్ధం కొంతవరకు అవగతం అవుతుందేమో కానీ వారు పాడుతున్నప్పుడు భావం, అర్ధంతో పాటు కవిలోని ఆర్ద్రత కూడా ఆవిష్కరించబడింది. ఇలాంటి గాయకుడు దొరకడం తెలుగు వారిగా మన అదృష్టం.. ఇలాంటి గాయకుడు పాడిన బాషాని విని అర్థం చేసుకోవడం మన పూర్వజన్మ సుకృతం, అటువంటి గాయకుడు నభూతో నభవిష్యత్ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదన్నారు. శత గళార్చన నాలుగు భాగాల స్వాగతోపన్యాసంతో మనల్ని అలరించిన శారద ఆకునూరి (హ్యూస్టన్, USA), ఈ చివరి భాగంలో తన బృందం నుంచి వరప్రసాద్ బాలినేని, పేరూరి వెంకట సోమశేఖర్, కృష్ణ నాలాది, రాజశేఖర్ సూరిభొట్ల, సురేష్ ఖాజా, జ్యోతిర్మయి బొమ్ము, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, రమణ జువ్వాది, సత్యనారాయణ ఉల్మురి, ఉష మోచెర్ల ఘంటసాల పాటల ద్వారా ఆయనను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమములో శ్యామ్ అప్పాలి (లాస్ ఏంజెలెస్, USA) బృందం నుంచి సాయి కాశీభొట్ల, శ్రీనివాస్ రాణి, ప్రసాద్ పార్థసారధి, సుధాకర్, వర్మ అల్లూరి, శ్రీహర్ష, శ్రీవల్లి శ్రీధర్, శ్రీయాన్ కంసాలి, ఆదిత్య కార్తీక్ ఉపాధ్యాయుల, అనూష వెన్నల, గౌరిధర్ మధు, రాజ్యలక్ష్మి వుదాతు, మీనాక్షి అనిపిండి, శాంత సుసర్ల, రఘు చక్రవర్తి, శ్రీధర్ జూలపల్లి, హరీష్ కొలపల్లి, నారాయణరెడ్డి ఇందుర్తి, వంశీకృష్ణ ఇరువరం పాల్గొన్నారు. శ్యాం అప్పాలి శత గళార్చన 4 భాగాలకు సాంకేతిక సహాయాన్ని కూడా అందించారు. శతగళార్చన కార్యక్రమంపై ఘంటసాల సతీమణి సావిత్రమ్మ, వారి కోడలు కృష్ణకుమారి మాట్లాడుతూ ముందుగా "ఘంటసాల కు భారతరత్న" కోసం కృషి చేస్తున్న 33 దేశాల నుంచి 119 మంది పాల్గొనడం చాలా సంతోషం కలిగిందని, వారందరికీ మా ప్రత్యేక ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాము. అలాగే విశిష్ట అతిధులుగా దర్శకుడు సుకుమార్, ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, రచయిత, నటులు దర్శకులు తనికెళ్ళ భరణి, గేయ రచయితలు చంద్రబోస్ అనంత శ్రీరామ్ తదితరులుకు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే ఇన్ని కార్యక్రమాలను విజయవంతం నిర్వహించిన బాలరెడ్డి ఇందుర్తి, సింగపూర్ రత్న కుమార్ కవుటూరు ధన్యవాదములు తెలియచేసారు. శత గళార్చనకు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోందని. చాలా మంది ప్రముఖులు "ఘంటసాల గారికి భారతరత్న" విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న ఘంటసాల కుటుంబ సభ్యులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ బాల రెడ్డి ఇందుర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
అమెజాన్ ప్రైమ్‌లో "A- Ad Infinitum"
అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సూపర్ హిట్ థ్రిల్లర్ చిత్రం "A- Ad Infinitum". అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై గీతా మిన్సాల నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ని తెచ్చుకుంది. నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. డిఫరెంట్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో నూటికి నూరు శాతం సఫలమయ్యింది. ఈ సినిమా పై మొదటినుంచి మంచి అంచనాలు ఉండగా విడుదలైన తొలిరోజు నుంచే బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ని సొంతం చేసుకుంది. మొదటి ఆటనుంచే ట్రెమండస్ రెస్పాన్స్ రాబట్టుకోవడమే కాకుండా విభిన్నమైన కాన్సెప్ట్ ఉన్న సినిమాగా విమర్శకుల ప్రశంశలు సంపాదించుకుంది. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది అని ప్రేక్షకులు చెప్తున్నారు.. విజయ్ కురాకుల సంగీతంకు మంచి పేరు రాగా అనంత్ శ్రీరామ్ అద్భుతమైన సాహిత్యాన్నీ అందించారని కితాబు దక్కించుకున్నాడు. తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.. థియేటర్లలో ఈ సినిమాకి ఉన్న డిమాండ్ చూసి అమెజాన్ ఫాన్సీ ధరకు ఈ సినిమాను కొనుగోలు చేసింది. కాగా ప్రస్తుతం అమెజాన్‌లో కూడా ఈ సినిమా ఇతర టాప్ సినిమాలకు పోటీ గా నిలుస్తుంది.. చదవండి :ఆసక్తిని రేకిస్తున్న ‘పీనట్ డైమండ్’ టీజర్ ఆచార్య.. స్టోరీ లైన్ తెలిసిపోయింది! -
ఆ యుగళగీతంలో ఎన్నో విశేషాలు
అన్నవరం : ‘బాహుబలి’ సినిమా కోసం తాను రాసిన యుగళగీతం ఎంతగానో పేరు తెస్తుందని ఆశిస్తున్నట్లు ప్రముఖ సినీ గేయరచయిత అనంత శ్రీరామ్ అన్నారు. ఆ సినిమాలో ప్రభాస్, తమన్నాలపై చిత్రీకరించిన ఆ పాటలో చాలా విశేషాలున్నాయన్నారు. శనివారం సాయింత్రం కుటుంబసభ్యులతో కలసి ఆయన సత్యదేవుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్యూ విశేషాలు.. సాక్షి: ఇంతవరకూ ఎన్ని సినిమాలకు పాటలు రాశారు, తొలి సినిమా ఏది? అనంత శ్రీరామ్: సుమారు 50 సినిమాల్లో 700 పాటల వరకూ రాశాను. తొలిసినిమా ‘కాదంటే ఔననిలే’. సాక్షి: రాజకీయపార్టీలకు కూడా పాటలు రాసినట్టున్నారు ? అనంత: అవును, వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్, ప్రజారాజ్యం, లోక్‌సత్తా పార్టీలకు 50 పాటలు రాశాను. సాక్షి: ‘బాహుబలి’కి రాసిన పాటలోని విశేషాలేంటి ? అనంత: ఆ పాటలో భాష అటు జానపదానికి, ఇటు వాడుక తెలుగుకు మధ్యలో ఉంటుంది. భక్తి, శృంగార రసాలను మిళితం చేసి ఎటూ మొగ్గకుండా రాసిన పాట అది. సాక్షి: మీ పాటలలో మీకు బాగా నచ్చేవి..? అనంత: ‘కొత్త బంగారులోకం, బొమ్మరిల్లు, ఏ మాయ చేశావే, స్టాలిన్, ఊహలు గుసగుసలాడే’ సినిమాల్లో పాటలు ఇష్టం. ప్రస్తుతమైతే ‘బాహుబలి’కి రాసిన పాట ఇష్టం. సాక్షి: మీరు ఇష్టపడే సినీ పాటల రచయిత ? అనంత: ఇంకెవరు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. సాక్షి: మీరు పాటలు రాస్తున్న కొత్త సినిమాలు? అనంత : మహేష్‌బాబు హీరోగా వస్తున్న బ్రహ్మోత్సవం, గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వస్తున్న చిత్రం, దిల్‌రాజు నిర్మాతగా ఉన్న రెండు సినిమాలు, మరో సినిమా ఉన్నాయి. సాక్షి: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న చిరంజీవి గారి 150 సినిమాకు పాటలు రాయమని అడిగారా? అనంత : అలాంటి సమాచారం ఏదీ లేదు. పూరి జగన్నాథ్ గారి చిత్రాలకు ఇప్పటి వరకూ రాయలేదు. -
సాంగు భళా
‘చిన్న చిత్రం’ జేబీ లక్ష్మణ్ జీవితాన్ని పెద్ద వులుపే తిప్పింది. అనూహ్యంగా సినీ పరిశ్రమలో స్థిరపడేలా చేసింది. ‘కృతజ్ఞత’ అనే లఘు చిత్రానికి రాసిన పాట యుూట్యూబ్‌లో వేలల్లో హిట్స్ సంపాదించింది. దెబ్బకు మనోడి కెరీర్‌కు సిల్వర్ స్క్రీన్ ‘టచ్’ వచ్చేసింది. కట్ చేస్తే... ప్రస్తుతం ప్రవుుఖ చిత్రాలకు లిరిక్స్ రైటర్‌గా మంచి జోష్ మీదున్నాడీ కుర్రాడు. సినీ రంగంలో లక్ష్మణ్ ‘షార్ట్’ జర్నీ ఇదీ... సొంతూరు కరీంనగర్ జిల్లా జగిత్యాలలోని కల్వాయి. హైదరాబాద్‌లో ఎంఏ, ఎల్ఎల్బీ చేశా. ఎనిమిదో తరగతి నుంచే పాటలు రాయడమంటే ఆసక్తి. కాలేజీ డేస్‌లో కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే మనముండాల్సిందే. చిన్న చిన్న కవితలు, పాటలు రాసి ఫ్రెండ్స్‌కు వినిపించేవాడిని. కాలేజీ ఫంక్షన్లలో పాడేవాడిని. పాటలు, సాహిత్యంపై పట్టు సాధించేందుకు సామాజిక తత్వవేత్త బీఎస్ రాములు ఇచ్చిన పుస్తకాలు బాగా ఉపయోగపడ్డాయి. 2009లో హైదరాబాద్‌లో జరిగిన నంది నాటకోత్సవాల్లో నేను రాసి పాడిన ప్రకృతి పాటకు నంది అవార్డుతో పాటు రూ.పదివేల నగదు లభించింది. అప్పటి నుంచి నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. సినీ ప్రముఖులు చంద్రబోస్, కాశీ విశ్వనాథ, అనంత్ శ్రీరామ్ వద్ద పాటలు రాయడంలో మెలకువలు నేర్చుకున్నా. అప్పుడే లఘు చిత్రాలకు స్క్రిప్ట్ వర్క్ చేశా. అదే సవుయుంలో సన్నిహితులు నిర్మిస్తున్న ‘కృతజ్ఞత’, ‘కక్ష’ షార్ట్ ఫిల్మ్స్‌కి పాటలు రాసే అవకాశం వచ్చింది. ఈ పాటలు సూపర్ హిట్. కెరీర్ కొత్త మలుపు తిరిగింది. దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమయ్యే కాంతిరేఖ టైటిల్ సాంగ్ రాసే అవకాశం వచ్చింది. విడుదలకు సిద్ధంగా ఉన్న ‘మన ఊరి సాక్షిగా’, ‘ఈజీ మనీ’, ‘ప్రేమించు’ సినిమాలకు పాటలు రాశా. అల్తాఫ్ హుస్సేన్, కృష్ణవేణి హీరో హీరోయిన్లుగా నటించిన ‘మళ్లీ రాదోయ్.. లైఫ్’ సినిమాకు లిరిక్స్ అందించా. ఈ నెల ఏడున విడుదలైన ఈ సినిమా పాటలకు మార్కెట్లో మంచి ఆదరణ కనబడుతోంది. వాంకె శ్రీనివాస్ -
మనసుకు నచ్చిన పనిలోనే సంతృప్తి
తుని : మనసుకు నచ్చిన పనిని ఎంచుకోవడంలోనే సంతృప్తి ఉంటుందని నిరూపించాడు సినీగేయ రచయిత చేగొండి అనంత శ్రీరామ్. ఇంజనీరింగ్ చదివినప్పటికీ పాటల రచనతోనే సంతృప్తి ఉంటుందని భావించి సినీరంగంలో ప్రవేశించారు. ఆయనతో మాటా మంతీ. ప్ర : సినీ గేయరచయిత ఎలా అయ్యారు? జ : 12ఏళ్ల వయస్సులోనే పాటలు రాయడం ప్రారంభించాను. నాకు గురువంటూ ఎవరూ లేరు. మా నాన్నగారు వీరవెంకట సత్యనారాయణ మూర్తికి సాహితీవేత్తలతో ఉన్న పరిచయం వల్ల సినీ గేయ రచయితను కాగలిగాను. ప్ర : మీ విద్యాభ్యాసం ఎక్కడెక్కడ సాగింది? జ : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు దగ్గర ఉన్న దొడ్డిపట్ల మా స్వగ్రామం. పదోతరగతి వరకు అక్కడే చదివాను. ఇంటర్ విజయవాడలోను, ఇంజనీరింగ్ బాపట్లలోను చేశాను. ప్ర : ఇంజనీరింగ్ పూర్తి చేశారా? జ : ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతుండగా పాటలపై మక్కువ పెరిగింది. ఇంజనీరింగ్ కన్నా పాటలే సంతృప్తినిస్తాయని భావించి ఆపేశాను. ప్ర : మీ తొలిపాట ఏచిత్రానికి చేశారు ? జ : కాదంటే ఔననిలే చిత్రంలో అవకాశం లభించింది. 2006లోనే హైదరాబాద్ వెళ్లాను. అప్పటి నుంచి అక్కడే ఉండిపోయాను. ప్ర : ఇప్పటి వరకు ఎన్ని పాటలు రాశారు ? జ : 195 చిత్రాలకు 558 పాటలను రాశాను. అందరివాడు సినిమాతో గుర్తింపు వచ్చింది. ప్ర : ఏ రచయిత ఇష్టం ? జ : సిరివెన్నల సీతారామశాస్త్రి పాటలు అంటే ఇష్టం. ప్ర : సినీరంగంలో కొత్త గేయ రచయితలకు అవకాశాలు ఉన్నాయా ? జ : సినీ పరిశ్రమకు కొత్త గేయ రచయితల అవసరం ఉంది. అవగాహన ఉంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. -
నచ్చిన రంగంలోనే మెచ్చుకోలు
పిల్లల అభిరుచులను తల్లిదండ్రులు గౌరవించాలి ‘శ్రీప్రకాష్’ ముఖాముఖిలో సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ పాయకరావుపేట, న్యూస్‌లైన్: యువత ఆశయాలకు తగ్గట్లుగా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే సత్ఫలితాలు వస్తాయని ప్రముఖ సినీ గేయ రచయిత చేగొండి అనంత్ శ్రీరామ్ అన్నారు. పాయకరావుపేట శ్రీప్రకాష్ విద్యా సంస్థలో బుధవారం సాయంత్రం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంత్ శ్రీరామ్ విద్యార్థులు సంధించిన పలు ప్రశ్నలకు బదులిస్తూ.. అబ్బాయి డాక్టర్, అమ్మాయి ఇంజనీర్ కావాలన్న దృక్పథంతో తల్లిదండ్రులు ఉండటంవల్ల 20 ఏళ్లపాటు అభివృద్ధి జరగలేదన్నారు. ప్రతి విషయంపై అవగాహన ఉంటే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చునన్నారు. ఎవరికి ఇష్టమైన వృత్తి వారు ఎంచుకుంటే 75 శాతంమంది సంతోషంగా ఉంటారన్నారు. ఇదే దృక్పథంతో ఇంజనీరింగ్ విద్య మధ్యలో మానివేసి ఫిల్మ్ ఇండస్ట్రీకి పదేళ్ల క్రితం వచ్చానన్నారు. ఇప్పటి వరకు 558 పాటలు రచించానని, మొదటి సినిమాతోనే సింగిల్ కార్డు రచయితగా నిలిచానన్నారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్, లోక్‌సత్తా పార్టీలకు ప్రచార గీతాలు రాశానన్నారు. ప్రస్తుత రాజకీయాలు తప్పును ప్రోత్సహిస్తున్నాయని, ఓట్లు అమ్ముడుపోవడం విచారకరమన్నారు. ప్రతి విద్యార్థి పదిమందిలో మార్పు తీసుకువస్తే చాలావరకూ వ్యవస్థ బాగుపడుతుందన్నారు. అనంతరం శ్రీప్రకాష్ విద్యా సంస్థల జాయింట్ సెక్రటరీ సీహెచ్ విజయ్ ప్రకాష్ అనంత్ శ్రీరామ్‌కు జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో వేటూరి సేవాపీఠం వ్యవస్థాపక కార్యదర్శి కె.ఆర్.జె.శర్మ తదితరులు పాల్గొన్నారు.