మనసుకు నచ్చిన పనిలోనే సంతృప్తి | interview with ananth sriram | Sakshi
Sakshi News home page

మనసుకు నచ్చిన పనిలోనే సంతృప్తి

Published Fri, Jan 31 2014 3:47 PM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM

మనసుకు నచ్చిన పనిలోనే సంతృప్తి

మనసుకు నచ్చిన పనిలోనే సంతృప్తి

తుని : మనసుకు నచ్చిన పనిని ఎంచుకోవడంలోనే సంతృప్తి ఉంటుందని నిరూపించాడు సినీగేయ రచయిత చేగొండి అనంత శ్రీరామ్. ఇంజనీరింగ్ చదివినప్పటికీ పాటల రచనతోనే సంతృప్తి ఉంటుందని భావించి సినీరంగంలో ప్రవేశించారు. ఆయనతో  మాటా మంతీ.


 ప్ర : సినీ గేయరచయిత ఎలా అయ్యారు?
 జ :  12ఏళ్ల వయస్సులోనే పాటలు రాయడం ప్రారంభించాను. నాకు గురువంటూ ఎవరూ లేరు. మా నాన్నగారు వీరవెంకట సత్యనారాయణ మూర్తికి సాహితీవేత్తలతో ఉన్న పరిచయం వల్ల సినీ గేయ రచయితను కాగలిగాను.  


 ప్ర : మీ విద్యాభ్యాసం ఎక్కడెక్కడ సాగింది?
 జ :  పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు దగ్గర ఉన్న దొడ్డిపట్ల మా స్వగ్రామం. పదోతరగతి వరకు అక్కడే చదివాను. ఇంటర్ విజయవాడలోను, ఇంజనీరింగ్ బాపట్లలోను చేశాను.


 ప్ర : ఇంజనీరింగ్ పూర్తి చేశారా?
 జ : ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతుండగా పాటలపై మక్కువ పెరిగింది. ఇంజనీరింగ్ కన్నా పాటలే సంతృప్తినిస్తాయని భావించి ఆపేశాను.


 ప్ర : మీ తొలిపాట ఏచిత్రానికి చేశారు ?
 జ :  కాదంటే ఔననిలే చిత్రంలో అవకాశం లభించింది. 2006లోనే హైదరాబాద్ వెళ్లాను. అప్పటి నుంచి అక్కడే ఉండిపోయాను.


 ప్ర : ఇప్పటి వరకు ఎన్ని పాటలు రాశారు ?
 జ : 195 చిత్రాలకు 558 పాటలను రాశాను. అందరివాడు సినిమాతో గుర్తింపు వచ్చింది.


 ప్ర : ఏ రచయిత ఇష్టం ?
 జ :  సిరివెన్నల సీతారామశాస్త్రి పాటలు అంటే ఇష్టం.


 ప్ర : సినీరంగంలో కొత్త గేయ రచయితలకు అవకాశాలు ఉన్నాయా ?
 జ : సినీ పరిశ్రమకు కొత్త గేయ రచయితల అవసరం ఉంది. అవగాహన  ఉంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement