
టాలీవుడ్ సినీ రచయిత, లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుమారుడితో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. తెలుగులో గొప్ప రచయితగా పేరు తెచ్చుకున్న రామజోగయ్య శాస్త్రి ప్రస్తుతం దేవర సినిమాకు పనిచేస్తున్నారు. తాజాగా రిలీజైన చుట్టమల్లే చుట్టేస్తావే సాంగ్‌కు లిరిక్స్ అందించారు.
ఇవాళ తిరుమల దర్శన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెలలో తన కుమారుడి పెళ్లి ఉందని వెల్లడించారు. అందుకే తిరుమల స్వామివారికి మొదటి ఆహ్వాన పత్రిక అందజేసేందుకు వచ్చినట్లు రామజోగయ్య తెలిపారు. కాగా.. రామజోగయ్య శాస్త్రికి హర్ష, తేజ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
వెంకన్న దర్శనం అద్భుతంగ జరిగింది
నేను మా చిన్నబ్బాయ్ ❤️గోవిందా🙏🙏 pic.twitter.com/Our25bxRne— RamajogaiahSastry (@ramjowrites) August 6, 2024
Comments
Please login to add a commentAdd a comment