
Sirivennela Sitaramasastry Popular Hit Songs: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ అనారోగ్యంతో కన్నుమూశారు. ఇటీవల ఆయన న్యూమోనియాతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. ఆయన అసలు పేరు చేంబోలు సీతారామ శాస్త్రీ. ఆయన 'సిరివెన్నెల' సినిమాతో సినీ ఇండస్ట‍్రీలో అడుగు పెట‍్టారు. 1986లో విడుదలైన శాస్త్రీయ సంగీత ప్రాధాన్యమున్న ఈ సినిమాకు కళాతపస్వీ కే. విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. 'సిరివెన్నెల' చిత్రంలోని 'విధాత తలపున ప్రభవించినది' అంటూ ఆయన రాసిన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో 'సిరివెన్నెల సీతారామశాస్త‍్రీ'గా స్థానం సంపాదించి పెట్టంది.
ఆయన కలం నుంచి జాలువారిన సాహిత్యం ఎంతో మంది మదిని మీటుతుంది. మూడు నాలుగు నిమిషాలుండే పాటలో సినిమా తాలుకు భావాన్ని నింపడం అదికూడా అర్ధమయ్యే పదాలతో రాయడం అంటే అది అందరికీ సాధ్యం కాదు.. అలా పాటలు రాయడంలో దిగ్గజాలు అయిన మహానుభావులలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒకరు. మొదటి సినిమాతోనే తనలోని సరస్వతిని దర్శక దిగ్గజం కళాతపస్వి కే. విశ్వనాథ్‌కు పరిచయం చేశారు సిరివెన్నెల. ఆ సినిమాలో ఆయన రాసిన పాటలన్నీ ఆణిముత్యాలే. అలాగే రుద్రవీణ సినిమాలో 'నమ్మకు నమ్మకు ఈ రేయినీ' అనే పాట, 'లలిత ప్రియ కమలం విరిసినదీ' అనే పాటలను అద్భుతంగా రాసారు. 'లలిత ప్రియ కమలం' పాటకు గాను జాతీయ అవార్డును కూడా అందుకున్నారు.
అలాగే కృష్ణ వంశీ తెరకెక్కించిన సింధూరం సినిమాలో ఆయన రాసిన 'అర్ధ శతాబ్దపు' పాట సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అగ్నిజ్వాలలను రగిలించే పాటలే కాదు చిగురుటాకు లాంటి అందమైన ప్రేమ గీతాలను కూడా సీతారామ శాస్త్రీ అందించారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం తెలుగు సినిమాలో 'నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని' అని పాటను రాయడంమే కాదు అందులో పాడి నటించి మెప్పించారు. ఈ పాటకు సిరివెన్నెలను ప్రభుత్వం నంది పురస్కారంతో సత్కరించింది. ఆయన కలం నుంచి జాలువారిన అనేక వేల పాటల్లో ఆణిముత్యాలు ఎన్నో. ఇటీవల ఆర్‌ఆర్ఆర్ నుంచి విడుదలైన 'దోస్తీ' పాటతో కూడా అలరించారు సిరివెన్నెల సీతారామ శాస్త‍్రీ. ఎన్నో వేల అద‍్భుత గేయాలు అందించి సంగీత ప్రపంచంలో జో కొట్టిన ఆయనకు నివాళిగా ఆ ఆణిముత్యాలు మీకోసం.
1. విధాత తలపున ప్రభవించినది (సిరివెన్నెల)
2. పారాహుషార్ (స్వయంకృషి)
3. నమ్మకు నమ్మకు ఈ రేయిని (రుద్రవీణ)
4. తరలిరాద తనే వసంతం (రుద్రవీణ)
5. ఘల్లు ఘల్లు (స్వర్ణకమలం)
6. బోటనీ పాఠముంది (శివ)
7. కొత్త కొత్తగా ఉన్నది (కూలీ నెం 1)
8. చిలుకా క్షేమమా (రౌడీ అల్లుడు)
9. జాము రాతిరి జాబిలమ్మ (క్షణక్షణం)
10. వారేవా ఏమీ ఫేసు (మనీ)
11. నిగ్గ దీసి అడుగు (గాయం)
12. అమ్మ బ్రహ్మ దేవుడో (గోవిందా గోవిందా)
13. చిలకా ఏ తోడు లేక (శుభలగ్నం)
14. తెలుసా మనసా (క్రిమినల్)
15. హైలెస్సో హైలెస్స (శుభసంకల్పం)
16. అపురూపమైనదమ్మ ఆడజన్మ (పవిత్రబంధం)
17. అర్ధ శతాబ్దపు (సింధూరం)
18. జగమంత కుటుంబం నాది (చక్రం)
19. సామజ వరగమన (అల వైకుంఠపురములో)
20. దోస్తీ (ఆర్ఆర్ఆర్)
Comments
Please login to add a commentAdd a comment