ఆ యుగళగీతంలో ఎన్నో విశేషాలు | anantha sriram interview | Sakshi
Sakshi News home page

ఆ యుగళగీతంలో ఎన్నో విశేషాలు

Published Sun, Jun 7 2015 1:07 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

ఆ యుగళగీతంలో ఎన్నో విశేషాలు - Sakshi

ఆ యుగళగీతంలో ఎన్నో విశేషాలు

అన్నవరం : ‘బాహుబలి’ సినిమా కోసం  తాను రాసిన యుగళగీతం ఎంతగానో పేరు తెస్తుందని ఆశిస్తున్నట్లు ప్రముఖ సినీ గేయరచయిత అనంత శ్రీరామ్ అన్నారు. ఆ సినిమాలో ప్రభాస్, తమన్నాలపై చిత్రీకరించిన ఆ పాటలో చాలా విశేషాలున్నాయన్నారు. శనివారం సాయింత్రం కుటుంబసభ్యులతో కలసి ఆయన సత్యదేవుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్యూ విశేషాలు..
 
 సాక్షి: ఇంతవరకూ ఎన్ని సినిమాలకు పాటలు రాశారు, తొలి సినిమా ఏది?
 అనంత శ్రీరామ్: సుమారు 50 సినిమాల్లో 700 పాటల వరకూ రాశాను. తొలిసినిమా ‘కాదంటే ఔననిలే’.  
 
 సాక్షి: రాజకీయపార్టీలకు కూడా పాటలు రాసినట్టున్నారు ?
 అనంత: అవును, వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్, ప్రజారాజ్యం, లోక్‌సత్తా పార్టీలకు 50 పాటలు రాశాను.
 
 సాక్షి: ‘బాహుబలి’కి రాసిన పాటలోని విశేషాలేంటి ?
 అనంత: ఆ పాటలో భాష అటు జానపదానికి, ఇటు వాడుక తెలుగుకు మధ్యలో ఉంటుంది. భక్తి, శృంగార రసాలను మిళితం చేసి ఎటూ మొగ్గకుండా రాసిన పాట అది.
 
 సాక్షి: మీ పాటలలో మీకు బాగా నచ్చేవి..?
 అనంత: ‘కొత్త బంగారులోకం, బొమ్మరిల్లు, ఏ మాయ చేశావే, స్టాలిన్, ఊహలు గుసగుసలాడే’ సినిమాల్లో పాటలు ఇష్టం. ప్రస్తుతమైతే ‘బాహుబలి’కి రాసిన పాట ఇష్టం.
 
 సాక్షి: మీరు ఇష్టపడే సినీ పాటల రచయిత ?
 అనంత: ఇంకెవరు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.
 
 సాక్షి: మీరు పాటలు రాస్తున్న కొత్త సినిమాలు?
 అనంత : మహేష్‌బాబు హీరోగా వస్తున్న బ్రహ్మోత్సవం, గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వస్తున్న చిత్రం, దిల్‌రాజు నిర్మాతగా ఉన్న రెండు సినిమాలు, మరో సినిమా ఉన్నాయి.
 
 సాక్షి: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న చిరంజీవి గారి 150 సినిమాకు పాటలు రాయమని అడిగారా?
 అనంత : అలాంటి సమాచారం ఏదీ లేదు. పూరి జగన్నాథ్ గారి చిత్రాలకు ఇప్పటి వరకూ రాయలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement