ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్‌లో అశ్లీలత, హింస లేకుండా కచ్చితంగా స్వీయ సెన్సార్ చేసుకోవాలని నెట్‌ఫ్లిక్స్, డిస్నీ వంటి స్ట్రీమింగ్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. రాయిటర్స్ కథనం ప్రకారం.. కేంద్ర సమాచార, బ్రాడ్‌కాస్టింగ్ శాఖ జూన్ 20న నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఓటీటీ సంస్థలకు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓటీటీ సంస్థలు కూడా తమ అభ్యంతరాలను తెలియజేశారు. ఫలితంగా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మీటింగ్ రికార్డ్స్, ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది.
ఓటీటీల్లో ప్రసారమవుతున్న అసభ్యకరమైన, అశ్లీల కంటెంట్‌పై ప్రజలు, పౌర సంఘాలు, ప్రజాప్రతినిధులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను కేంద్ర సమాచార, బ్రాడ్‌కాస్టింగ్ శాఖ ఆయా స్ట్రీమింగ్ సంస్థల ముందుంచింది. వీటిలో ప్రసారయ్యే ప్రముఖ సినీ తారలు నటించిన కంటెంట్ కూడా అసభ్యకర, అశ్లీల, హింసను, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉందంటూ సమాజం నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సంబంధించి సెన్సార్ పకడ్బంధీగా ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెన్సార్ బోర్డ్ విడుదల సినిమాలను చూసి సర్టిఫికెట్ జారీ చేస్తుంది. కానీ ఓటీటీలలో ప్రసారయ్యే కంటెంట్‌కు అలాంటి వ్యవస్థ లేదు. ఓటీటీ ప్రసారాలను సమీక్షించేందుకు గాను స్వతంత్ర ప్యానెల్‌ను ఏర్పాటు చేసుకునే విషయాన్ని ఆలోచించాలని మీటింగ్ సందర్భంగా శాఖ ప్రతినిధులు ఇండస్ట్రీ వర్గాలను కోరినట్లు తెలిసింది.
కాగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సంస్థలు భారత్‌లో అత్యంత ఆదరణ సంపాదించుకున్నాయి. దేశ స్ట్రీమింగ్ మార్కెట్ 2027 నాటికి 7 బిలియన్ డాలర్ల విలువను చేరుకుంటుందని అంచనా.
ఇదీ చదవండి: సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్! సోషల్ మీడియా దెబ్బకు దిగొచ్చిన మల్టీప్లెక్స్!
Comments
Please login to add a commentAdd a comment