పాకెట్ఎఫ్ఎం సంస్థ తన ఆడియో సిరీస్ కాపీరైట్‌ను డిస్నీ+ హాట్‌స్టార్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు వెంటనే స్పందించి సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.
పిటిషన్‌లోని వివరాల ప్రకారం..ఆన్‌లైన్ ఆడియో ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫామ్ పాకెట్ఎఫ్ఎం తన ఆడియో సిరీస్ 'యక్షిణి'ని పెయిడ్ కస్టమర్లకు అందిస్తోంది. దానికి సంబంధించిన పూర్తి కాపీరైట్ హక్కులు సంస్థ కలిగి ఉంది. ఇటీవల వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్ ‘యక్షిణి’ని పోలిఉండే వెబ్‌సిరీస్ ట్రైలర్ విడుదల చేసింది. పాకెట్‌ఎఫ్‌ఎం వెంటనే దాన్ని సదరు ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించాలని కోరుతూ జూన్ 11న దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
ఇదిలాఉండగా, జూన్ 14 నుంచి ఈ తెలుగు వెబ్‌సిరీస్ ప్రారంభం కాబోతుందని డిస్నీ+ హాట్‌స్టార్ ప్రకటించింది. దాంతో పాకెట్‌ఎఫ్‌ఎం డిస్నీ+ హాట్‌స్టార్ మాతృసంస్థ అయిన నోవీ డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై కోర్టులో దావా వేసింది. వెబ్‌సిరీస్ ట్రైలర్‌ను తొలగించేలా సంస్థను ఆదేశించాలని కోర్టును అభ్యర్థించింది.
ఇదీ చదవండి: సిమ్ కార్డు, వై-ఫై కనెక్షన్ లేకపోయినా మెసేజ్‌లు పంపాలా..?
ఈ వ్యాజ్యం గురువారం జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ వ్యవహారంపై డిస్నీ+ హాట్‌స్టార్ తన ప్రత్యుత్తరాన్ని దాఖలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. మే 2021 నుంచి పాకెట్‌ఎఫ్‌ఎం ప్లాట్‌ఫామ్‌లో ‘యక్షిణి’ ఆడియో సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment