FM
-
తెలుగు వెబ్‌సిరీస్ తొలగించాలని కోర్టులో పిటిషన్
పాకెట్ఎఫ్ఎం సంస్థ తన ఆడియో సిరీస్ కాపీరైట్‌ను డిస్నీ+ హాట్‌స్టార్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు వెంటనే స్పందించి సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.పిటిషన్‌లోని వివరాల ప్రకారం..ఆన్లైన్ ఆడియో ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్ పాకెట్ఎఫ్ఎం తన ఆడియో సిరీస్ 'యక్షిణి'ని పెయిడ్ కస్టమర్లకు అందిస్తోంది. దానికి సంబంధించిన పూర్తి కాపీరైట్ హక్కులు సంస్థ కలిగి ఉంది. ఇటీవల వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్ ‘యక్షిణి’ని పోలిఉండే వెబ్‌సిరీస్ ట్రైలర్ విడుదల చేసింది. పాకెట్ఎఫ్ఎం వెంటనే దాన్ని సదరు ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించాలని కోరుతూ జూన్ 11న దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.ఇదిలాఉండగా, జూన్ 14 నుంచి ఈ తెలుగు వెబ్‌సిరీస్ ప్రారంభం కాబోతుందని డిస్నీ+ హాట్‌స్టార్ ప్రకటించింది. దాంతో పాకెట్ఎఫ్ఎం డిస్నీ+ హాట్‌స్టార్ మాతృసంస్థ అయిన నోవీ డిజిటల్ ఎంటర్టైన్మెంట్పై కోర్టులో దావా వేసింది. వెబ్‌సిరీస్ ట్రైలర్‌ను తొలగించేలా సంస్థను ఆదేశించాలని కోర్టును అభ్యర్థించింది.ఇదీ చదవండి: సిమ్ కార్డు, వై-ఫై కనెక్షన్ లేకపోయినా మెసేజ్‌లు పంపాలా..?ఈ వ్యాజ్యం గురువారం జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ వ్యవహారంపై డిస్నీ+ హాట్‌స్టార్ తన ప్రత్యుత్తరాన్ని దాఖలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. మే 2021 నుంచి పాకెట్ఎఫ్ఎం ప్లాట్ఫామ్లో ‘యక్షిణి’ ఆడియో సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. -
దిగ్గజ ఎఫ్ఎమ్ సంస్థను కొనుగోలు చేయనున్న కంపెనీలు ఇవేనా..
ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ ఇండియా లిమిటెడ్ (ఈఎన్ఐఎల్)లో భాగంగా ఉన్న రేడియో మిర్చితో పాటు రేడియో ఆరెంజ్... బిగ్ ఎఫ్ఎమ్ రేడియో నెట్‌వర్క్‌ను కొనుగోలు చేసేందుకు రూ.251 కోట్ల చొప్పున బిడ్ వేశాయని సమాచారం. దివాలా ప్రక్రియలో ఉన్న బిగ్ ఎఫ్ఎమ్ రేసులో హర్యానాకు చెందిన సఫైర్ ఎఫ్ఎమ్ కూడా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సఫైర్ ఎఫ్ఎమ్ కూడా బిగ్ ఎఫ్ఎమ్ కోసం రూ.251 కోట్ల రూపాయల బిడ్ వేసింది. రేడియో మిర్చి, ఆరెంజ్ ఎఫ్ఎమ్ , సఫైర్ ఎఫ్‌ఎమ్‌ల బిడ్ మొత్తాన్ని 30 రోజుల్లోగా చెల్లిస్తామని ప్రకటించాయి. తమ బిడ్ల విలువను మరింత పెంచాలని లెండర్లు అడిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే కంపెనీ ఖాతాల్లో ఉన్న రూ.60 కోట్ల నగదు కూడా లెండర్లకే వెళ్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బిగ్ ఎఫ్ఎం ఖాతాల్లోని నగదును లెక్కలోకి తీసుకున్న తర్వాత, లెండర్లకు ఇంకా రూ. 578 కోట్లు రావాలి. ఇది దేశంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్. 1,200 పట్టణాలకు, 50 వేలకుపైగా గ్రామాలకు ప్రసారాలను అందిస్తోంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో, ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు దివాలా ప్రక్రియకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఇంకా బిగ్ఎఫ్ఎమ్ సంస్థ ఈ అంశంపై స్పందించాల్సి ఉంది. -
యువ ఇంజనీర్ సక్సెస్ స్టోరీ: ఎప్పుడూ అవే పాటలా.. పాకెట్ ప్రపంచంలోకి
ప్రయాణంలో, తీరిక వేళల్లో ఎఫ్ఎంలో పాటలు వినడం సహజమే. ‘ఎప్పుడూ అవే పాటలు, అవే మాటలేనా’ అనుకుంటారు కొద్దిమంది. వారిలో రోహన్ నాయక్ ఒకరు. ఈ యువ ఇంజనీర్ తన స్నేహితులతో కలిసి బెంగళూరు కేంద్రంగా ప్రారంభించిన ‘పాకెట్ ఎఫ్ఎం’ వివిధ జానర్స్, వివిధ భాషలలో ఆకట్టుకునే ఆడియో సిరీస్‌లతో దూసుకుపోతుంది... కొన్నిసార్లు ఐడియాల కోసం వెదుక్కుంటూ వెళ్లనక్కర్లేకుండానే... అవే మనల్ని వెదుక్కుంటూ వస్తాయి. రోహన్ నాయక్ విషయంలోనూ అలాగే జరిగింది. ఇంటి నుంచి ఆఫీసుకు చేరుకోవడానికి చాలా టైమ్ పట్టేది. టైమ్‌పాస్ కోసం ఎఫ్‌ఎంలలో మ్యూజిక్ వినేవాడు. అయితే ఆ మ్యూజిక్ అదేపనిగా రిపీట్ కావడంతో బోర్‌గా ఉండేది. ‘భారతీయ భాషల్లో ఆడియో స్టోరీ టెల్లింగ్ ప్లాట్‌ఫామ్ ఉంటే బాగుండేది’ అనుకునేవాడు. ‘మనం కావాలనుకుంటున్నది కాలమే మన చేత చేయిస్తుంది’ అన్నట్లుగా ఆ ప్రయత్నానికి తానే శ్రీకారం చుట్టాడు రోహన్ నాయక్. ఐఐటీ–ఖరగ్‌పూర్ ఫ్రెండ్స్ ప్రతీక్ దీక్షిత్, నిశాంత్ కేఎస్లతో కలిసి ‘పాకెట్ ఎఫ్.ఎం’కు శ్రీకారం చుట్టాడు. మ్యూజిక్ కాకుండా ‘ఆడియో ఎంటర్టైన్మెంట్’ లక్ష్యంగా మొదలైన ఈ ఆడియో సిరీస్ ప్లాట్‌ఫామ్ అన్యూవలైజ్డ్ రెవెన్యూ రన్‌రేట్(ఏఆర్ఆర్)తో దూసుకుపోవడానికి ఎంతో కాలం పట్టలేదు. ‘ప్రస్తుతం శ్రోతలు సగటున రోజుకు వంద నిమిషాల సమయాన్ని వినడానికి వెచ్చిస్తున్నారు. మా యాప్ టోటల్ మంత్లీ ఆడియో స్ట్రీమింగ్‌లో ఎప్పటికప్పుడు వృద్ధి కనిపిస్తోంది’ అంటున్నాడు పాకెట్ ఎఫ్.ఎం. ఫౌండర్లలో ఒకరైన నిశాంత్. రొమాన్స్, హారర్, థ్రిల్లర్, ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్...అనేవి పాకెట్ ఎఫ్.ఎం.లో టాప్ జానర్లుగా ఉన్నాయి. ఎపిసోడ్లు 10–15 నుంచి 25–30 నిమిషాల వరకు ఉంటాయి. ‘పాకెట్ ఎఫ్.ఎం’ ఆడియో సెగ్మెంట్ సిరీస్‌లో కొన్ని హిట్ టైటిల్స్... యే రిష్తా కైసా హై(400 మిలియన్), లవ్ కాంట్రాక్ట్(200 మిలియన్), యక్షిణీ (195 మిలియన్), షూర్వీర్(129 మిలియన్)...మొదలైనవి. ‘పాకెట్ఎఫ్ఎం’లో 733 ఆడియో సిరీస్‌లతో పాటు ఆడియో బుక్స్ కూడా ఉన్నాయి. గత అక్టోబర్‌లో ఆన్లైన్ రీడింగ్ ప్లాట్‌ఫామ్ ‘పాకెట్ నావెల్’కు శ్రీకారం చుట్టారు. ఇక శ్రోతల విషయానికి వస్తే 15 నుంచి 35 ఏళ్ల లోపు ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు. బెంగళూరు, ముంబై, దిల్లీ, పుణె, హైదరాబాద్‌లు టాప్ 5 సిటీస్‌గా ఉన్నాయి. మరోవైపు చిన్న పట్టణాలలో కూడా ‘పాకెట్ఎఫ్ఎం’ పాపులర్ అవుతుంది. లాంగ్ ఫార్మట్ ఆడియో ఎంటర్టైన్మెంట్ సిరీస్ ద్వారా ఒటీటీ స్పేస్‌ను పునర్నిర్వచించే ప్రయత్నం చేస్తున్న ‘పాకెట్ ఎఫ్ఎం’ యాడ్–టెక్ ప్లాట్‌ఫామ్ ‘రియల్ టైమ్ యాడ్స్’ను తీసుకువచ్చింది. ‘పాకెట్ ఎఫ్ఎం విజయవంతం కావడంలో ఎఐ, ఎంఎల్ సాంకేతికత కీలక పాత్ర పోషించింది. శ్రోతల నాడి పసిగట్టడం, సంక్లిష్టమైన విషయాలను సరళం చేయడం, ఖర్చులు తగ్గించుకోవడం... ఇలా ఎన్నో విషయాల్లో సాంకేతికత ఉపయోగపడింది’ అంటున్నాడు కంపెనీ సీటీవో ప్రతీక్ దీక్షిత్. కంపెనీకి లైట్‌స్పీడ్, టెన్సెంట్, టైమ్స్ ఇంటర్నెట్లాంటి కీ ఇన్వెస్టర్లు ఉన్నారు. ఇప్పుడు పాకెట్ ఎఫ్.ఎం. యూఎస్ మార్కెట్లోకి కూడా విస్తరించే ప్రయత్నం చేస్తోంది. ‘టీమ్ మెంబర్స్‌కు అద్భుతమైన శక్తి,సామర్థ్యాలు, అంకితభావం ఉన్నాయి’ అంటున్నాడు టాంగ్లిన్ వెంచర్ పార్ట్నర్స్కు చెందిన సంకల్ప్ గుప్తా. పాకెట్ ఎఫ్.ఎం.ను ‘నెట్‌ఫ్లిక్స్ ఆఫ్ ఆడియో వోటీటీ ప్లాట్‌ఫామ్స్’ గా తీర్చిదిద్దాలనేది ముగ్గురు విజేతల లక్ష్యం. పాకెట్ ఎఫ్.ఎం. విజయవంతం కావడంలో ఎఐ, ఎంఎల్ సాంకేతికత కీలక పాత్ర పోషించింది. శ్రోతల నాడి పసిగట్టడం, సంక్లిష్టమైన విషయాలను సరళం చేయడం, ఖర్చులు తగ్గించుకోవడం... ఇలా ఎన్నో విషయాల్లో సాంకేతికత ఉపయోగపడింది. – ప్రతీక్ దీక్షిత్ -
విద్య, వైద్య సేవలకు పన్ను మినహాయింపు
-
విద్య, వైద్య సేవలకు పన్ను మినహాయింపు
శ్రీనగర్: గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ) పన్ను ను జూలై 1 నుంచి అమలు చేయాలని కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ వైపుగా కదులుతోంది. ఈ నేపథ్యంలో పన్ను విధానంపై ఈ నెల 18, 19న జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా 19నాటి సమావేశంలో సర్వీసెస్ పన్నురేట్లపై ఒప్పందం కుదిరిందన్నారు. అయితే తదుపరి జీఎస్టీ15వ సమావేశం ఢిల్లీలో జూన్ 3న నిర్వహిస్తాంమని జైట్లీ ప్రకటించారు. . శుక్రవారం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జిఎస్టి) కౌన్సిల్ సమావేశం రెండవ రోజున, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ విద్య, వైద్య సేవలను పన్ను మినహాయింపు ఇచ్చినట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం తమకు లాండ్ మార్క్ లాంటిదన్నారు. ఈ మేరకు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసిందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్టీ ప్రకటించారు. విస్తృతంగా సేవలకు నాలుగు పన్నుల విధానానికి కౌన్సిల్ అంగీకరించిందనీ, ఎక్కువ శాతం 18 శాతం పన్ను విధించనున్నమని చెప్పారు. ఈ పన్ను వర్గీకరణలు సేవ యొక్క స్వభావంపై ఆధారపడి ఉంటుందని ఆర్ధిక మంత్రి తెలిపారు. మిగిలిన సర్వీసెస్ రేట్లను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ట్రాన్స్పోర్ట్ సర్వీసులపై 5 శాతం పన్ను, ఎసీ బార్ అండ్ రెస్టారెంట్లు 18శాతం, ఫైప్ స్టార్ , హోటెల్, రేస్‌కోర్స్ , గాంబ్లింగ్, సినిమాపై 28 శాతం పన్నును నిర్ణయించారు. 6 కేటగిరీలపై ఇంకా నిర్ణయించాల్సి ఉంది. దీనిపై మరింత కౌన్సిల్ పై మరింత చర్చ జరగాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో టెలికాం సర్వీసులు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసులపై 18 శాతంగా నిర్ణయించారు. అలాగే తదుపరి సమావేశంలో బంగారంపై జీఎస్టీని నిర్ణయించనున్నామని చెప్పారు. -
కరెన్సీ కొరత నిజమే..కానీ..
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దుతో దేశంలో నెలకొన్న నగుదు కొరత సంక్షోభంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. కరెన్సీ కొరత ఉందని ఒప్పుకున్నారు. కానీ పెద్దనోట్ల రద్దుపై ప్రభుత్వ నిర్ణయం సరైందేనని, పరివర్తన సమయంలో కొంత పెయిన్ తప్పదని చెప్పుకొచ్చారు. పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో డిశెంబర్ 5-7 తేదీల్లో నిర్వహించిన పెట్రోటెక్ 2016 సమావేశంలోఆర్థిక మంత్రి ప్రసంగించారు. నవంబర్ 8న ప్రభుత్వం ప్రకటించిన డీమానిటైజేషన్ నిర్ణయాన్ని పూర్తిగా సమర్ధించారు. పెద్ద నోట్ల రద్దు లాంటి సంచలన నిర్ణయం తర్వాత కరెన్సీ నోట్ల కొరత నెలకొందని ఆయన అంగీకరించారు నగదు కొరత ఉన్నట్టుగా కొంతమంది భావిస్తున్నారు, కానీ డిజిటల్ వైపు అడుగులు వేస్తున్న క్రమంలో ఈ కొరత తప్పదన్నారు. దీన్ని అధిగమించేందుకు ప్రతి రోజు కేంద్ర బ్యాంకు ఆర్ బీఐ కొంత కరెన్సీ కొంత మొత్తాన్ని విడుదల చేస్తోందని వివరించారు. మీడియా సహా మిగతా అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఉన్నప్పటికీ, చివరికి మంచి ఫలితాలు రానున్నాయని చెప్పారు. స్వల్పకాలికంగా కొన్ని ఇబ్బందులున్నప్పటికీ దీర్ఘకాల ప్రయోజనాలు సమకూరనున్నాయని జైట్లీ పేర్కొన్నారు. బ్యాంకుల్లో నగదు నిల్వలు పెరగడం ఆర్థిక వృద్దిగా దన్నుగా నిలుస్తుందన్నారు. లావాదేవీల్లో పారదర్శకత మూలంగా పన్నుల వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. తద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియను ప్రభుత్వం క్రమంగా సమీక్షిస్తోందని తెలిపారు. ఈ విషయంలో బ్యాంకులు సక్రమమైన లావాదేవీల సులభతరం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని భరోసా ఇచ్చారు.అలాగే ఇటీవలి సంవత్సరాలలో డిజిటల్ చెల్లింపులకోసం బ్యాంకింగ్ టెక్నాలజీ అభివృద్ధి, మొబైల్ బ్యాంకింగ్ లాంటి వినూత్న సాంకేతిక సేవల ద్వారా ప్రతీ చిన్నలావాదేవీని సులభంగా నిర్వహిచడానికి వీలవుతోందని జైట్లీ చెప్పారు. -
మన్‌బోలే తంబోలా
వినసొంపైన పాటలు.. అంతకుమించిన మాటలతో సిటీ శ్రోతలను అలరిస్తున్న రేడియో సిటీ 91.1 ఎఫ్ఎం ‘రేడియో సిటీ తంబోలా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సాక్షి దినపత్రిక భాగస్వామ్యంతో ఈ మెగా మ్యూజిక్ ఈవెంట్‌ని కండక్ట్ చేస్తోంది. ప్రతి బుధ, శుక్రవారాల్లో సాక్షి పత్రికలో కొన్ని పాటలతో లిస్ట్ ప్రచురితమవుతుంది. ఆ లిస్ట్‌లో ఇచ్చిన పాటలు ఆయా రోజుల్లో ఉదయం 9.30 నుంచి 10.30 గంటల మధ్య రేడియో సిటీలో ప్రసారమవుతాయి. పాట విన్న శ్రోతలు పాటల లిస్ట్‌లో ఏవైనా 5 పాటలను సీక్వెన్స్ మిస్ కాకుండా కరెక్ట్ ఆర్డర్లో టైప్ చేసి 56060 నంబర్‌కు మెసేజ్ చేస్తే చాలు. కరెక్ట్‌గా ఎస్సెమ్మెస్ పంపిన వారు రూ.2,000 విలువ చేసే ప్రైజ్ గెలుచుకునే అవకాశం ఉంది. సో.. ఆ లక్కీ విన్నర్ మీరే ఎందుకు కాకూడదు. -
బిగ్ ఎఫ్ఎంలో జూ॥జాకీ
మాటల ఊటలు.. స్పాంటేనిటీకి కేరాఫ్‌లు.. పంచ్‌లకు పర్మినెంట్ అడ్రస్‌లు.. రేడియో జాకీలు. ఎఫ్ఎంలో ముచ్చట్లు వినిపించే ప్రొఫెషనల్ ఆర్జేలకు ధీటుగా ఓ పన్నెండేళ్ల వసపిట్ట గొంతు సవరించింది. గలగల గోదారిలా.. మాటలతో మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ‘విను వినిపించు లైఫ్ అందించూ’ అంటూ బిగ్ ఎఫ్ఎం శ్రోతలను పలకరించింది. బాలల దినోత్సవం సందర్భంగా 92.7 ఎఫ్ఎం నిర్వహించిన చిన్నారి ఆర్జే హ ంట్లో ఒయాసిస్ స్కూల్‌కు చెందిన భావన సెలక్టయింది. ‘హియర్ హియర్ మేక్ ఏ లైఫ్ బ్యూటిఫుల్’ అంటూ జూనియర్ ఆర్జేగా అదరగొట్టింది. ఒయాసిస్ స్కూల్లో ఏడో తగరతి చదువుతున్న భావన మామూలుగానే కబుర్ల పోగు. ఫ్రెండ్స్ ధరణి, తన్మయి కలిశారంటే వాళ్ల మధ్య సరదా సంభాషణలు నాన్ స్టాప్‌గా సాగుతూనే ఉంటాయి. గతేడాది క్రిస్మస్ వేడుకల్లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు 92.7 ఎఫ్ఎం ఆర్జేలు సందీప్, సుందరి.. భావన చదివే ఒయాసిస్ స్కూల్‌కు వచ్చారు. ఎవరైనా సరదాగా కాసేపు ఏదైనా టాపిక్‌పై మాట్లాడతారా? అనడమే తరువాత భావన, తన్మయి, ధరణి సై అంటూ ముందుకొచ్చి వహ్వా అనిపించారు. టెస్ట్.. వన్.. టూ.. త్రీ.. బాలల దినోత్సవం సందర్భంగా ఏటా 92.7 ఎఫ్ఎం జూనియర్ ఆర్జేలను సెలెక్ట్ చేస్తుంటుంది. ఈ క్రమంలో ఒయాసిస్ స్కూల్‌కూ ఓ చాన్సిచ్చారు. మూడు రౌండ్ల సెలెక్షన్ ప్రాసెస్‌లో భావన అన్నింటా ముందు నిలిచింది. మొదటి రౌండ్లో కాస్త కామెడీగా వాళ్లను వాళ్లు పరిచయం చేసుకోవాలి. సెకండ్ రౌండ్లో దర్శకుడు ఒక సీన్‌కు యాక్షన్ చెప్పే సన్నివేశాన్ని కామెడీగా చేయాలి. మూడో రౌండ్లో రౌడీలు స్కూల్‌ను ఆక్రమిస్తే హీరో వచ్చి కాపాడే సన్నివేశాన్ని కామెడీ యాంగిల్లో నటించి చూపాలి. మూడు రౌండ్లకు కలిపి 30 మార్కులకు భావన 27 మార్కులు, ధరణి 26.5 మార్కులు సాధించి జూనియర్ ఆర్జేలుగా ఎంపికయ్యారు. సిటీలోని 13 స్కూల్స్ నుంచి బిగ్ ఎఫ్ఎం మొత్తం 40 మందిని ఎంపిక చేసింది. ఫైనల్స్‌లో అందరినీ వెనక్కి నెట్టి భావన ఈ సీజన్ జూనియర్ ఆర్జేగా ఎంపికైంది. తొలిరోజే సీనియర్ ఆర్జే జ్యోత్స్నతో కలసి తన సత్తా చాటింది. ఆదితో చిట్‌చాట్.. భావన తొలి రోజే హీరో ఆదితో ‘హాయ్ బాగున్నారా?.. నేను జూనియర్ ఆర్జే భావనను’ అంటూ మాట కలిపింది. పెళ్లి, భార్య వివరాలు, రఫ్ సినిమా విశేషాలను ఆసక్తికరంగా రాబట్టింది. చదువు, ఆటపాటలు.. చదువుతోపాటు ఆటపాటలు, ఉపన్యాస పోటీలంటే భావనకు ఆసక్తి ఎక్కువ. ఆయా అంశాల్లో ఇప్పటి వరకు 11 మెడల్స్, మూడు ట్రోఫీలు, 85 వివిధ రకాల సర్టిఫికెట్లు సాధించింది. చదువులోనూ రాణిస్తూ క్లాస్‌లో మొదటి ర్యాంక్ సాధిస్తోంది. గతేడాది బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది స్కూల్‌గా ఎంపికైంది కూడా.