విద్య, వైద్య సేవలకు పన్ను మినహాయింపు | GST rate: Most services to be taxed at 18%, says FM | Sakshi
Sakshi News home page

విద్య, వైద్య సేవలకు పన్ను మినహాయింపు

Published Fri, May 19 2017 4:12 PM | Last Updated on Tue, Sep 5 2017 11:31 AM

విద్య, వైద్య సేవలకు పన్ను మినహాయింపు

విద్య, వైద్య సేవలకు పన్ను మినహాయింపు

శ్రీనగర్‌: గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ)  పన్ను ను జూలై 1 నుంచి అమలు చేయాల‌ని కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ  వైపుగా కదులుతోంది. ఈ నేపథ్యంలో పన్ను విధానంపై ఈ నెల 18, 19న జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ముఖ‍్యంగా 19నాటి సమావేశంలో  సర్వీసెస్‌ పన్నురేట్లపై  ఒప‍్పందం కుదిరిందన్నారు.  అయితే తదుపరి  జీఎస్‌టీ15వ  సమావేశం ఢిల్లీలో జూన్‌ 3న  నిర్వహిస్తాంమని  జైట్లీ  ప్రకటించారు.  .

శుక్రవారం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జిఎస్టి) కౌన్సిల్ సమావేశం రెండవ రోజున, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ  విద్య, వైద్య సేవలను పన్ను మినహాయింపు ఇచ్చినట్టు ప్రకటించారు.  ఈ నిర్ణయం తమకు లాండ్‌ మార్క్‌ లాంటిదన్నారు. ఈ మేరకు  జీఎస్‌టీ  కౌన్సిల్‌ సమావేశం ముగిసిందని ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్టీ ప్రకటించారు.  విస్తృతంగా సేవలకు నాలుగు పన్నుల  విధానానికి కౌన్సిల్‌  అంగీకరించిందనీ, ఎక్కువ శాతం 18 శాతం పన్ను విధించనున్నమని  చెప్పారు.  ఈ  పన్ను వర్గీకరణలు సేవ యొక్క స్వభావంపై ఆధారపడి ఉంటుందని ఆర్ధిక మంత్రి  తెలిపారు.  మిగిలిన  సర్వీసెస్‌ రేట్లను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.    

ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసులపై 5 శాతం పన్ను, ఎసీ బార్‌ అండ్‌ రెస్టారెంట్లు 18శాతం,  ఫైప్‌ స్టార్‌ , హోటెల్‌,   రేస్‌కోర్స్‌ , గాంబ్లింగ్‌,  సినిమాపై 28 శాతం పన్నును నిర్ణయించారు.  6 కేటగిరీలపై ఇంకా నిర్ణయించాల్సి  ఉంది. దీనిపై మరింత కౌన్సిల్‌ పై మరింత చర్చ జరగాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో టెలికాం సర్వీసులు,  బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసులపై 18 శాతంగా నిర్ణయించారు. అలాగే తదుపరి సమావేశంలో బంగారంపై జీఎస్‌టీని నిర్ణయించనున్నామని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement