మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈమధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. పబ్ ఇన్సిడెంట్ తర్వాత టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన నిహారిక ఇటీవలె ఇన్‌స్టాగ్రామ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సొంత బ్యానర్‌లో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ బిజీగా మారిన నిహారిక తాజాగా తల్లి పద్మజతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్బంగా ఇటీవలి కాలంలో నిహారికపై వచ్చిన వార్తలపై నాగబాబు భార్య, నిహారిక తల్లి పద్మజ స్పందించింది.
'మొదట్లో ఇలాంటి వార్తలు రావడం ఇబ్బందిగా అనిపించేది కానీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇలాంటివి తప్పదు. తప్పు చేయనంత వరకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నిహారిక ఎక్కడికైనా వెళ్లినా నాకేం అనిపించదు. నా కూతురేంటో నాకు తెలుసు. నాకు మా బావగారున్నారు.ఆయన ఉన్నంతవరకు మాకేం పర్వాలేదు' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment