వెంకటేశ్ కుటుంబానికి అండగా నిలుస్తాం : నాగబాబు | Chiranjeevi Family donates one lakh to kin of deceased fan | Sakshi
Sakshi News home page

వెంకటేశ్ కుటుంబానికి అండగా నిలుస్తాం : నాగబాబు

Published Sat, Dec 7 2013 5:16 AM | Last Updated on Wed, Jul 25 2018 3:28 PM

వెంకటేశ్ కుటుంబానికి అండగా నిలుస్తాం : నాగబాబు - Sakshi

వెంకటేశ్ కుటుంబానికి అండగా నిలుస్తాం : నాగబాబు

సాక్షి,సిటీబ్యూరో: రాజకీయాలకతీతంగా చిరంజీవి అభిమానులు ఏకంగా ఉండాలని సినీనటుడు కె.నాగబాబు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా పాలెంలో జరిగిన వోల్వో బస్సు దుర్ఘటనలో మృతిచెందిన అఖిలభారత చిరంజీవి ఫ్యాన్స్‌వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.వెంకటేశ్‌యాదవ్ సంస్మరణసభ శుక్రవారం రవీంద్రభారతిలో జరిగింది. నాగబాబు ప్రసంగిస్తూ ఇబ్బందుల్లో ఉన్న చిరంజీవి అభిమానుల కుటుంబాలకు తాము అండగా ఉంటామన్నారు.

వెంకటేశ్‌యాదవ్ పిల్లలు జీవితంలో స్థిరపడే వరకు చేదోడువాదోడుగా నిలుస్తామని హామీఇచ్చారు. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ మాట్లాడుతూ వెంకటేశ్‌యాదవ్ మృతి అభిమాన సంఘానికి తీరనిలోటన్నారు. సినీ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ చిరంజీవి అభిమాని చనిపోతే ఇంత స్పందన వస్తుందని అనుకోలేదని చెప్పారు.

ఈసందర్భంగా మృతుల కుటుంబీకులకు రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో రూ.6లక్షల డీడీని, ఇతరులకు మరో రూ.3 లక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్, రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు ఆర్.స్వామినాయుడు, తమిళనాడు రాష్ట్ర చిరంజీవి యువసేన అధ్యక్షుడు కె.నాగేష్, తెలంగాణ అధ్యక్షుడు కె.ప్రభాకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement