Naga Babu Respond On Varun Tej Marriage, Details Inside In Telugu - Sakshi
Sakshi News home page

Naga Babu: వరుణ్‌ తేజ్‌ పెళ్లెప్పుడు? ప్రశ్నకు నాగబాబు ఆన్సర్‌ ఏంటంటే?

Published Mon, Mar 21 2022 9:21 PM | Last Updated on Tue, Mar 22 2022 10:05 AM

Naga Babu Respond On Varun Tej Marriage - Sakshi

మెగా బ్రదర్‌ నాగబాబు సోషల్‌మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా నెట్టింట అభిమానులతో షేర్‌ చేసుకుంటాడీ నటుడు. తాజాగా ఆయన ఫ్యాన్స్‌తో చిట్‌చాట్‌ నిర్వహించాడు. ఈ సందర్భంగా నాగబాబుకు 'వరుణ్‌తేజ్‌ పెళ్లెప్పుడు?' అన్న ప్రశ్న ఎదురైంది. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ ప్రశ్న విని, దానికి సమాధానాలు చెప్పి విసుగెత్తిపోయిన ఈయన ఈ క్వశ్చన్‌కు వరుణ్‌తేజే ఆన్సరిస్తాడని చెప్పి తెలివిగా తప్పించుకున్నాడు.

కాగా గతంలోనూ వరుణ్‌ అన్న మ్యారేజ్‌ ఎప్పుడు చేస్తారు బాస్‌ అని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా మంచి సంబంధాలు ఉంటే చూడమని బదులిచ్చాడు నాగబాబు. మరొకసారైతే వరుణ్‌ ప్రేమ వివాహం చేసుకున్నా తనకెలాంటి అభ్యంతరం లేదని పరోక్షంగా బదులిచ్చాడు. ఇదిలా ఉంటే వరుణ్‌ ఓ హీరోయిన్‌ను పెళ్లాడబోతుందంటూ ప్రచారం జరగ్గా అది వట్టి పుకారుగానే తేలిపోయింది. హైదరాబాద్‌కు చెందిన ఓ పారిశ్రామికవేత్త కూతురితో ఏడడుగులు వేయబోతున్నాడంటూ కూడా కథనాలు రాగా అది కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. ఇక వరుణ్‌ సినిమాల విషయానికి వస్తే అతడు నటించిన ఎఫ్‌3 మే 27న విడుదలవుతుండగా గని ఏప్రిల్‌ 8న రిలీజ్‌ అవుతోంది.

చదవండి: రోడ్డు ప్రమాదంలో బిగ్‌బాస్‌ ఫణికి తీవ్ర గాయాలు, 'బతుకు మీద ఆశ లేకపోవడం కూడా చావే'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement