Varun Tej Reaction on Ask Nagababu - Sakshi
Sakshi News home page

Varun Tej: ఆ ప్రశ్న అడగొద్దన్నా ఇప్పటికీ నాన్న అడుగుతూనే ఉంటారు

Published Thu, Apr 7 2022 7:15 PM | Last Updated on Thu, Apr 7 2022 8:43 PM

Varun Tej Reaction on Ask Nagababu - Sakshi

దయచేసి మమ్మల్ని తొందరగా రమ్మని అడగకండి అని నేనూ, నిహారిక రిక్వెస్ట్‌ చేసేవాళ్లం. కానీ ఇప్పటికీ ఆయన ఫోన్‌ చేసి ఎక్కడున్నావు, త్వరగా రా అనేవారు. షూటింగ్‌లో ఉన్నాను నాన్న, మధ్యలో ఎలా వచ్చేస్తాను, షూటింగ్‌ అయ్యాక వస్తాను అని చెప్పేవాడిని.

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ తాజాగా నటించిన చిత్రం గని. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించారు. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ రేపు(ఏ‍ప్రిల్‌ 8న) విడుదల కానుంది. ఈ సందర్భంగా వరుణ్‌తేజ్‌ సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. నాగబాబు నిర్వహించే ఆస్క్‌ మీ ఎనీథింగ్‌పై కూడా స్పందించాడు.

'ఇంతకుముందు నాన్న అంటే భయం ఉండేది. నాలుగైదు సినిమాలు చేశాక కూడా భయముండేది. కానీ ఇప్పుడు మేము ఫ్రెండ్స్‌ అయ్యాం. ఆస్క్‌ నాగబాబు అంటూ అడిగే అన్ని ప్రశ్నలను నేను ఎప్పుడో అడిగేశాను. ఇకపోతే దయచేసి మమ్మల్ని తొందరగా రమ్మని అడగకండని నేనూ, నిహారిక రిక్వెస్ట్‌ చేసేవాళ్లం. కానీ ఇప్పటికీ ఆయన ఫోన్‌ చేసి ఎక్కడున్నావు, త్వరగా రా అనేవారు. షూటింగ్‌లో ఉన్నాను నాన్న అని చెప్పినా సరే త్వరగా వచ్చేయాలనేవారు. మధ్యలో ఎలా వచ్చేస్తాను, షూటింగ్‌ అయ్యాక వస్తాను అని చెప్పేవాడిని. ఒక తండ్రిగా అలా అడగడం ఆయన అలవాటు' అని చెప్పుకొచ్చాడు. కాగా వరుణ్‌  నటించిన ఎఫ్‌ 3 సినిమా సైతం రిలీజ్‌కు రెడీ అవుతోంది. అలాగే ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్‌ ఫిల్మ్‌ కూడా కమిటయ్యాడీ హీరో.

చదవండి: యాక్షన్‌ ఫిల్మ్స్‌ చేద్దామని వచ్చా.. కానీ రొమాంటిక్‌ సినిమాలే

‘డేంజరస్‌’ మూవీ విడుదల వాయిదా.. కారణమిదే అంటూ వర్మ ట్వీట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement