![Varun Tej Engagement, Niharika Divorce Unexpected Events In Mega Family - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/5/12_2.jpg.webp?itok=wvloa_nJ)
ఓపక్క నిశ్చితార్థ తాంబూలాలు, మరోపక్క పదకొండేళ్ల తర్వాత రామ్‌చరణ్- ఉపాసన తల్లిదండ్రులు కావడంతో మెగా ఇంట సంతోషాలు వెల్లివిరిశాయి అనుకుంటే అంతలోనే నిహారిక విడాకుల వార్త పిడుగులా వచ్చి పడింది. ఈ వార్త విని మెగా అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. రెండు జీవితాలను పెళ్లితో ముడివేసే శుభకార్యం జరగబోతుంటే కలిసి కలకాలం జీవిస్తారనుకున్న మరో ఇద్దరు చెరో దారి చూసుకున్నారు. దీంతో మెగా ఇంట కొంత సంతోషం, మరికొంత విచారం నెలకొంది.
చిరంజీవి ఇంట బారసాల
పదకొండేళ్ల నిరీక్షణ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్- ఉపాసన తల్లిదండ్రులయ్యారు. తనకు ఎంతో ఇష్టమైన మంగళవారం పాపాయి జన్మించడంతో లక్ష్మీదేవే ఇంటికి వచ్చిందని మురిసిపోయాడు చిరంజీవి. చరణ్‌కు పుట్టిన తొలి బిడ్డ కావడంతో ఎంతో ఘనంగా బారసాల వేడుక నిర్వహించారు. క్లీంకార కొణిదెల అంటూ తన మనవరాలికి నామకరణం చేశాడు చిరు.
నాగబాబు ఇంట పెళ్లి బాజాలు
మరోపక్క చిరు సోదరుడు నాగబాబు ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. తమ ఏడేళ్ల ప్రేమబంధాన్ని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లారు. ఇరు కుటుంబాల అంగీకారంతో ఇటీవలే వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ రెండు శుభాకార్యాలతో మెగా ఇంట సంబరాలు వెల్లివిరిశాయి. అదే సమయంలో అభిమానులను ఎప్పటినుంచో ఓ సందేహం వెంటాడుతోంది.
చదవండి: టాలీవుడ్ డైరెక్టర్‌కు బ్రో షూ గిఫ్ట్, లక్షల్లోనే ఖరీదు
అటు పెళ్లి పనులు.. ఇటు విడాకుల ప్రక్రియ
నాగబాబు తనయురాలు నిహారిక కొణిదెల.. భర్త చైతన్య జొన్నలగడ్డతో దూరంగా ఉంటోంది. తన పెళ్లి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో డిలీట్ చేసింది. దీంతో వీళ్లిద్దరూ విడిపోయారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఇటీవల తన అన్నయ్య పెళ్లికి కూడా నిహారిక సింగిల్‌గానే అటెంట్ కావడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లైంది. చివరకు అదే నిజమని ధృవీకరిస్తూ తాము విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి షాకిచ్చారు నిహారిక, చైతన్య జొన్నలగడ్డ. ఓ పక్క వరుణ్ పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా, మరో పక్క నిహారిక విడాకులకు దరఖాస్తు చేసుకోవడం, అవి మంజూరు కావడంతో.. మెగా ఫ్యాన్స్ నిరాశచెందారు.
చదవండి: గెటౌట్ ఆఫ్ మై స్టూడియో.. నవ్వులు పూయిస్తున్న రంగబలి
Comments
Please login to add a commentAdd a comment