
ఈ ప్రపంచం ఎంతో కఠినమైన ప్రదేశం. నువ్వు లేకపోయుంటే ఈ ప్రపంచాన్ని ఎదుర్కోవడం మరింత కష్టమయ్యుండేది...
Naga Babu Wife Padmaja Birthday: మెగా బ్రదర్ నాగబాబు.. సినిమాల్లో నటిస్తూ, నిర్మాతగా రాణిస్తూ, పాపులర్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ సత్తా చాటుతున్నాడు. అటు బుల్లితెరతో పాటు వెండితెర ప్రేక్షకులకూ చేరువయ్యాడు. కుటుంబమే తన మొదటి ప్రపంచంగా భావిస్తాడు నాగబాబు. నేడు ఆయన సతీమణి పద్మజ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెతో కేక్ కట్ చేయించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు నాగబాబు.
'ఈ ప్రపంచం ఎంతో కఠినమైన ప్రదేశం. నువ్వు లేకపోయుంటే ఈ ప్రపంచాన్ని ఎదుర్కోవడం మరింత కష్టమయ్యుండేది. ఎల్లప్పుడూ నాతో ఉంటూ నీ ప్రేమతో, నీ ముందుచూపుతో అసాధ్యాలను కూడా సుసాధ్యాలు చేసినందుకు కృతజ్ఞతలు. హ్యాపీ బర్త్‌డే డియర్ పద్మ' అని శుభాకాంక్షలు తెలిపాడు. వరుణ్ తేజ్, నిహారిక సైతం తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.